తాజా వార్తలు డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి         విశాఖ మన్యంలో హైఅలర్ట్         తారీకు : 22-09-2020
 
గూగుల్‌ పిక్సెల్‌ 4a @26000!
నేడు విడుదల కానున్న బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌
6జీబీ + 128 జీబీ మోడల్‌ @349 డాలర్లు
6 జీబీ+ 64 జీబీ వెరైటీ ధర 300 డాలర్లు!
5జీ మోడల్‌ను సైతం విడుదల చేసే చాన్స్‌

ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ తయారీ ఐఫోన్‌ SE, చైనీస్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ తదితర మోడళ్లకు పోటీగా గూగుల్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లను రూపొందించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. నేడు యూఎస్‌ మార్కెట్లో పిక్సెల్‌ 4a మోడల్‌ 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌ ప్రవేశపెట్టనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి.

ధరలు ఇలా
పిక్సెల్‌ 4aను రెండు వేరియంట్లలో గూగుల్‌ రిలీజ్‌ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 6జీబీ + 128 జీబీ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను @349 డాలర్లు(సుమారు రూ. 26,000)గా నిర్ణయించవచ్చని అంచనా. ఇదే విధంగా 6 జీబీ+ 64 జీబీ వెరైటీ ధర 300 డాలర్లు(రూ. 22,400) ఉండవచ్చని ఊహిస్తున్నారు. 5జీ మోడల్‌కు సంబంధించి 499 డాలర్ల ధర(రూ. 37,300)ను అంచనా వేస్తున్నారు.

సాంకేతిక వివరాలు
5.8 అంగుళాల తెరను కలిగి ఉండే పిక్సెల్‌ 4a క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ చిప్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. 3140 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ మోడల్‌లో 5జీ వేరియంట్‌ను సైతం గూగుల్‌ విడుదల చేసే అవకాశముంది. ఈ ఫోన్‌ పంచ్‌హోల్‌ డిస్‌ప్లేతో 12.2 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా X52 మోడెమ్‌ కలిగిన పిక్సెల్‌ 5నూ గూగుల్‌ ప్రవేశపెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
బంగారం- వెండి- పతనం నుంచి రికవరీ
రెండు దశాబ్దాలలో.. రికార్డ్‌ లిస్టింగ్స్‌.
గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్
లాభాలతో షురూ- ఫార్మా హైజంప్‌
అటూఇటుగా.. బంగారం- వెండి
బంగారం- వెండి.. జోరు
వాటికి నిబంధనలు అవసరం లేదు : ట్రాయ్
జేబీ కెమ్‌- ఏడీఎఫ్‌ ఫుడ్స్‌.. హైజంప్‌
కరోనా : వారికి ఎస్‌బీఐ భారీ ఊరట.
స్వల్ప లాభాలతో.. బంగారం- వెండి
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1630760                      Contact Us || admin@rajadhanivartalu.com