తాజా వార్తలు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌         అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌         తారీకు : 25-05-2020
 
ట్విటర్‌ సంచలన నిర్ణయం
కరోనా : ట్విటర్‌ సంచలన నిర్ణయం

అసాధారణ పరిస్థితుల్లో అనూహ్య నిర్ణయం

ఎప్పటికీ వర్క్‌ ఫ్రం హోం - ట్విటర్‌

సంచలనం నిర‍్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విటర్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సోషల్ మీడియా, టెక్‌ దిగ్గజం ట్విటర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విటర్‌​ అవతరించింది. ట్విటర్‌ సీఈవో జాక్ డోర్సే మంగళవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకి ఈ-మెయిల్‌ ద్వారా తెలిపారు.


ప్రపంచవ్యాప్తంగా రిమోట్‌గా పనిచేసుకునే అవకాశమున్న తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసుకోవచ్చని ట్విటర్‌ ప్రకటించింది. సెప్టెంబరుకు ముందు చాలా కార్యాలయాలను తిరిగి తెరిచే అవకాశం లేనందున ఆఫీసుకు రావాలా వద్దా అనేది స్వయంగా వాళ్లే నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్‌ హెచ్‌ ఆర్​ చీఫ్‌ జెన్నిఫర్‌ క్రైస్ట్‌ వెల్లడించారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఇది ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు. సీఈవో జాక్ డోర్సే 2020 మధ్యలో మూడు నుండి ఆరు నెలల వరకు ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో దానిని వాయిదా వేసుకున్నారు. (మెగా ప్యాకేజీ ‌ : భారీ లాభాలు)

మరోవైపు కరోనా ‌, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఫేస్‌బుక్‌, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులలో చాలా మందిని ఈ సంవత్సరం చివరి వరకు ఇంటినుంచే పనిచేయడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సన్నాహకాలకుగాను మే 22 న ఒక రోజు సెలవు తీసుకోవాలని ఉద్యోగులను కోరినట్లు గూగుల్ గత వారం తెలిపింది.

కాగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్‌ బారిన పడ్డారు. చాలా దేశాలలో కఠినమైన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రజారవాణా, వ్యాపార వ్యవస్తలు స్థంభించిపోయీయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితులలో, పనివేళ్లలో కీలక మార్పుల చోటు చేసుకోనున్నాయి.
ట్విటర్‌ సంచలన నిర్ణయం
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్: నాలుగు రోజుల్లో రూ. 19 లక్షల కోట్ల నష్టం... నేడు రూ. 2 లక్షల కోట్ల లాభం!
మరోసారి రూ. 40 వేలు దాటిన పది గ్రాముల బంగారం ధర!
కరోనా భయాలను పక్కనపెట్టి దూసుకుపోయిన మార్కెట్లు
పేకమేడలా... మరో బ్లాక్ థర్స్ డే... 2 వేల పాయింట్లు పతనమైన సెన్సెక్స్!
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
బేకరీలో కరోనా వైరస్‌ కేక్‌లు...అచ్చంగా అదే రూపంలో అమ్మకం!
కుప్పకూలిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల షేర్లు.. మార్కెట్లలో మరో భారీ పతనం!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1592876                      Contact Us || admin@rajadhanivartalu.com