తాజా వార్తలు ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌         'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్         తారీకు : 20-02-2020
 
భలే భలే బుల్లి కారు...యూపీ ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణ!
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ప్రదర్శన
ఆకట్టుకుంటున్న ఫ్రెంచ్‌ కార్ల కంపెనీ రెనాల్టో ‘ట్విజీ’మోడల్‌
విద్యుత్‌తో నడిచే రెండు సీట్ల కారు
చిన్నకార్ల తయారీలో పేరొందిన జపాన్‌ సుజుకీ కంపెనీని తలదన్నేలాంటి బుల్లి కారును డిజైన్‌ చేసింది ఫ్రెంచ్‌ కార్ల కంపెనీ రెనాల్టో. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్రేటర్‌ నోయిడాలో ప్రస్తుతం జరుగుతున్న ‘ఆటో ఎక్స్‌పో 2020’లో ఈ కంపెనీ ప్రదర్శిస్తున్న ‘ట్విజీ’ మోడల్‌ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది టాటా నానో కారు కంటే చిన్నది. ప్రేమికులను ఆకట్టుకునేందుకా అన్నట్లు వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఈ రెండు సీట్ల కారును కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. యూరోపియన్‌ యూనియన్‌ మార్కెట్లో ప్రస్తుతం ఈ కారుకు మంచి ఆదరణ ఉందని చెబుతున్న కంపెనీ ప్రతినిధులు భారతీయ మార్కెట్లో కారును విడుదల చేసే ప్రణాళికలు ఉన్నట్లు మాత్రం వెల్లడించలేదు.

6.1 కిలోవాట్‌ బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జిచేస్తే వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీ చార్జింగ్‌కు నాలుగు గంటల సమయం పడుతుంది. విండ్‌స్క్రీన్‌, డోర్స్‌, పనోరమిక్‌ సన్‌ రూఫ్‌తో క్రేజీ లుక్‌తో కనిపిస్తోంది. అయితే ఈ రెండు సీట్ల కారు చాలా ఇరుకుగా ఉండడంతో ఒడ్డూ, పొడుగూ కాస్త ఎక్కువ ఉన్న వారికి అంత అనుకూలం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి: విజయ్ మాల్యా
ఈ వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు
హీరో స్ప్లెండర్ ప్లస్ బీఎస్-6 మోడల్ ఎలా ఉందో చూడండి!
మార్కెట్లోకి బీఎస్-6 తో కూడిన ‘బజాజ్ పల్సర్ 150 బైక్’
‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ ప్రత్యేక ఆఫర్
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భలే భలే బుల్లి కారు...యూపీ ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణ!
నా ఆస్తి విలువ సున్నా... చేతులెత్తేసిన అనిల్ అంబానీ!
భారత్‌లోని ఆటో పరిశ్రమను వణికిస్తున్న కరోనా వైరస్.. పరిశ్రమ వర్గాల ఆందోళన
మళ్లీ విధులకు హాజరవుతున్న చైనా ఉద్యోగులు, కార్మికులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1578406                      Contact Us || admin@rajadhanivartalu.com