తాజా వార్తలు కరోనా కట్టడికి ఏపీ సర్కారు చర్యలు అభినందనీయం: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ         తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దుల బంద్... నిలిచిన వందలాది వాహనాలు!         తారీకు : 07-04-2020
 
నా ఆస్తి విలువ సున్నా... చేతులెత్తేసిన అనిల్ అంబానీ!
రిలయన్స్ కమ్యూనికేషన్స్ కోసం చైనా బ్యాంకుల నుంచి రుణాలు
వ్యక్తిగత హామీలు సమర్పించిన అనిల్
రుణం రికవరీ కోసం బ్రిటన్ కోర్టును ఆశ్రయించిన చైనా బ్యాంకులు
ఆరు రోజుల్లో రూ.700 కోట్లు డిపాజిట్ చేయాలన్న కోర్టు
తన పెట్టుబడులన్నీ క్షీణించాయని నిస్సహాయత వ్యక్తం చేసిన అనిల్
ఒకప్పుడు రిలయన్స్ సామ్రాజ్యంలో యువరాజుగా ఖ్యాతిపొందిన అనిల్ అంబానీ కాలక్రమంలో పతనం అంచుల్లోకి జారిపోయారు. ఆస్తులు ఒక్కొక్కటీ చేజార్చుకుంటూ, ఓ దశలో అన్న ముఖేశ్ అంబానీ ఆపన్నహస్తంతో గట్టెక్కారు. ఇప్పుడు మరింత క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయి.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ కోసం చైనా బ్యాంకుల నుంచి అనిల్ అంబానీ భారీగా రుణాలు తీసుకున్నారు. కంపెనీ తరఫున తీసుకున్న ఈ రుణాలకు ఆయన వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారు. ఇప్పుడా ష్యూరిటీలే అనిల్ మెడకు చుట్టుకున్నాయి. 2012లో తాము రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థకు 925 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చామని, ఆ రుణం రికవరీ కోరుతూ ఆ మూడు చైనా ప్రభుత్వ బ్యాంకులు బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి.

దీనిపై విచారణలో భాగంగా, రూ.700 కోట్లు కోర్టులో జమ చేయాలని న్యాయస్థానం అనిల్ ను ఆదేశించింది. అందుకు ఆరు వారాల గడువు విధించింది. ఈ సందర్భంగా అనిల్ అంబానీ చేతులెత్తేశారు. "నా పెట్టుబడుల విలువ పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు నా ఆస్తుల విలువ సున్నా. సంక్షిప్తంగా చెప్పాలంటే నగదుగా మార్చుకోగలిగే వీలున్న ఆస్తులేవీ ఇప్పుడు నా అధీనంలో లేవు" అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు.

గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే అనిల్ ను ఆయన అన్న ముఖేశ్ అంబానీ రూ.462 కోట్లు చెల్లించి ఆదుకున్నారు. మరి ఈసారి అనిల్ పరిస్థితి ఏమవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్: నాలుగు రోజుల్లో రూ. 19 లక్షల కోట్ల నష్టం... నేడు రూ. 2 లక్షల కోట్ల లాభం!
మరోసారి రూ. 40 వేలు దాటిన పది గ్రాముల బంగారం ధర!
కరోనా భయాలను పక్కనపెట్టి దూసుకుపోయిన మార్కెట్లు
పేకమేడలా... మరో బ్లాక్ థర్స్ డే... 2 వేల పాయింట్లు పతనమైన సెన్సెక్స్!
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
బేకరీలో కరోనా వైరస్‌ కేక్‌లు...అచ్చంగా అదే రూపంలో అమ్మకం!
కుప్పకూలిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల షేర్లు.. మార్కెట్లలో మరో భారీ పతనం!
26, 27 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి...వరుస సెలవులు లేవు: ఉద్యోగ సంఘాలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1585562                      Contact Us || admin@rajadhanivartalu.com