తాజా వార్తలు కరోనా కట్టడికి ఏపీ సర్కారు చర్యలు అభినందనీయం: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ         తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దుల బంద్... నిలిచిన వందలాది వాహనాలు!         తారీకు : 07-04-2020
 
భారత్‌లోని ఆటో పరిశ్రమను వణికిస్తున్న కరోనా వైరస్.. పరిశ్రమ వర్గాల ఆందోళన
విడిభాగాల దిగుమతులపై కరోనా దెబ్బ
ఇప్పుడే ఓ అంచనాకు రాలేమంటున్న మారుతి
వచ్చే వారానికి స్పష్టత వస్తుందన్న టాటా
చైనా కరోనా వైరస్ భారత్‌లోని వాహన తయారీ పరిశ్రమలను కూడా వణికిస్తోంది. వైరస్ కారణంగా వాహన విడిభాగాల సరఫరాలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని వాహన తయారీదారుల సంఘం సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. గతవారం జరిగిన ఆటో ఎక్స్‌పో, ఆటో కాంపోనెంట్స్ ఎక్స్‌పోలకు చైనాలోని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరు కాకపోవడం ఇందుకు ఊతమిస్తోంది.

చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ భారత్‌లో వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించినా ఆ సంస్థ యాజమాన్యం కూడా ఈ ఎక్స్‌పోకు హాజరుకాలేదు. అంతేకాదు, హైమా పేరుతో వాహనాలను విక్రయించే ఎఫ్ఏడబ్ల్యూ గ్రూపు కూడా కరోనా వైరస్ కారణంగా భారత పర్యటనను రద్దు చేసుకుంది.

అయితే, కరోనా వైరస్ ప్రభావం చైనా నుంచి చేసుకునే ఆటో విడిభాగాల దిగుమతులపై ఏమాత్రం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేమని మారుతి సుజుకి ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో ఎటువంటి స్పష్టత లేదన్నారు. టాటా మోటార్స్ ఎండీ, సీఈవో గుంటెర్ బషెక్ ఇదే విషయమై మాట్లాడుతూ.. చైనాలోని ప్లాంట్లు తిరిగి తెరుచుకుని, కార్మికులు తిరిగి విధుల్లో చేరాక గానీ ఈ విషయంలో ఎటువంటి అంచనాకు రాలేమన్నారు. వచ్చే వారం ప్లాంట్లు తెరుచుకునే అవకాశం ఉందని, ఒకవేళ కార్మికులు విధులు హాజరుకాకుంటే ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
స్టాక్ మార్కెట్: నాలుగు రోజుల్లో రూ. 19 లక్షల కోట్ల నష్టం... నేడు రూ. 2 లక్షల కోట్ల లాభం!
మరోసారి రూ. 40 వేలు దాటిన పది గ్రాముల బంగారం ధర!
కరోనా భయాలను పక్కనపెట్టి దూసుకుపోయిన మార్కెట్లు
పేకమేడలా... మరో బ్లాక్ థర్స్ డే... 2 వేల పాయింట్లు పతనమైన సెన్సెక్స్!
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు
బేకరీలో కరోనా వైరస్‌ కేక్‌లు...అచ్చంగా అదే రూపంలో అమ్మకం!
కుప్పకూలిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల షేర్లు.. మార్కెట్లలో మరో భారీ పతనం!
26, 27 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి...వరుస సెలవులు లేవు: ఉద్యోగ సంఘాలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1585559                      Contact Us || admin@rajadhanivartalu.com