తాజా వార్తలు ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌         'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్         తారీకు : 20-02-2020
 
ఆకర్షణీయ ఫీచర్లతో హ్యుందాయ్ సరికొత్త కారు... 'ఆరా'!
సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్లో కొత్త మోడల్ తీసుకువచ్చిన హ్యుందాయ్
మారుతి సుజుకీ డిజైర్, హోండా అమేజ్ లకు పోటీ ఇచ్చే అవకాశం
ధర రూ.5.8 లక్షల నుంచి ప్రారంభం
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ భారత్ లో మరో మోడల్ తీసుకువచ్చింది. సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్ లో తీసుకువచ్చిన ఈ కారు పేరు ఆరా. ధరల శ్రేణి రూ.5.8 లక్షల నుంచి రూ.9.23 లక్షల మధ్య ఉంటుంది. సబ్ కాంపాక్ట్ విభాగంలో హ్యుందాయ్ ఆరా... మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ లకు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇది పెట్రోల్, డీజెల్ వెర్షన్లలో వస్తోంది. ఆరా కొన్ని అంశాల్లో గ్రాండ్ ఐ10 నియోస్ ను పోలి ఉంటుంది.

దీనికి డీఆర్ఎల్ (డే టైమ్ రన్నింగ్ లైట్లు), ట్రయాంగిల్ ఫాగ్ ల్యాంప్, జెడ్ ఆకారంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ అమర్చారు. రెండు వైపులా 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటితో కూడిన 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఎంటర్టయిన్ మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. మరింత భద్రత కోసం హ్యుందాయ్ ఆరాను 65 శాతం అడ్వాన్స్ డ్ హై స్ట్రెంగ్త్ స్టీల్ తో తయారుచేశారు. అంతేకాదు, రెడ్, పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, ఆల్ఫా బ్లూ, వింటేజ్ బ్రౌన్ రంగుల్లో ఈ కారు లభ్యమవుతుంది.
చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి: విజయ్ మాల్యా
ఈ వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు
హీరో స్ప్లెండర్ ప్లస్ బీఎస్-6 మోడల్ ఎలా ఉందో చూడండి!
మార్కెట్లోకి బీఎస్-6 తో కూడిన ‘బజాజ్ పల్సర్ 150 బైక్’
‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ ప్రత్యేక ఆఫర్
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భలే భలే బుల్లి కారు...యూపీ ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణ!
నా ఆస్తి విలువ సున్నా... చేతులెత్తేసిన అనిల్ అంబానీ!
భారత్‌లోని ఆటో పరిశ్రమను వణికిస్తున్న కరోనా వైరస్.. పరిశ్రమ వర్గాల ఆందోళన
మళ్లీ విధులకు హాజరవుతున్న చైనా ఉద్యోగులు, కార్మికులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1578464                      Contact Us || admin@rajadhanivartalu.com