తాజా వార్తలు క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ         ఏపీలో పలు కమిటీల ఏర్పాటు... చైర్మన్ల నియామకం         తారీకు : 14-11-2019
 
కూపన్ కోడ్‌లో పొరపాటు.. అమెజాన్‌ను ఖాళీ చేసిన వినియోగదారులు.. కోట్లాది రూపాయల నష్టం!
విద్యార్థుల కోసం ‘వెల్‌కమ్ 5’ కూపన్ కోడ్
పదేపదే ఎంటర్ చేసినా తీసుకున్న సైట్
పది రోజులపాటు కొనుగోళ్లతో టాప్ లేపేసిన విద్యార్థులు
విద్యార్థులను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ చేసిన ప్రయత్నం వికటించింది. అది చేసిన పొరపాటును గ్రహించిన విద్యార్థులు ఉచిత కొనుగోళ్లతో అమెజాన్‌ను ఖాళీ చేశారు. ఏకంగా పదిరోజుల పాటు ఈ ఉచిత హంగామా కొనసాగగా.. కొందరు విద్యార్థులు తాము కొనుగోలు చేసిన వస్తువులతో తాము ఉంటున్న ఇళ్లను నింపేశారు. బ్రిటన్‌లో జరిగిందీ ఘటన.

యూకేలో చదువుకుంటున్న విద్యార్థులను ఆకర్షించేందుకు అమెజాన్ ‘వెల్‌కమ్5’ అనే కూపన్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. తొలిసారి కొనుగోలు చేసే వారు ఈ కూపన్‌కోడ్‌ను ఎంటర్ చేస్తే రూ.450 రాయితీ లభిస్తుంది. అంతే మొత్తంలో ఉన్న వస్తువులను కొనుగోలు చేస్తే పూర్తిగా ఉచితం. అయితే, ఈ కోడ్ ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని పేర్కొంది.

విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. అయితే, కొందరు ఈ కూపన్‌ కోడ్‌ను మరోసారి ఎంటర్ చేయగా అప్పుడు కూడా పనిచేసింది. ఆ తర్వాత మరోమారు ట్రైచేయగా అప్పుడు కూడా కోడ్‌ను తీసుకుంది. ఈ విషయం క్షణాల్లోనే బ్రిటన్ మొత్తం పాకేసింది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు.

రోజంతా బుకింగ్‌లతోనే గడిపేశారు. వందలాది వస్తువులను ఆర్డర్ చేశారు. టూత్ పేస్టును కూడా వారు వదల్లేదు. ఒకానొక దశలో టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో అదే ఉండడం గమనార్హం. దాదాపు పదిరోజులపాటు ఈ కొనుగోళ్ల జాతర సాగినా జరిగిన పొరపాటును అమెజాన్ గుర్తించలేకపోయింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. దీనిపై విద్యార్థులు స్పందిస్తూ.. అమెజాన్‌ లాంటి సంస్థకు ఇదేమంత పెద్ద నష్టం కాబోదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. ఐటీకి నష్టాలు, బ్యాంకులకు లాభాలు
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ కు అన్యూహ్య స్పందన.. ఇప్పటి వరకు 70 వేల దరఖాస్తులు!
మనేసర్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేసిన హోండా!
ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యం... ఇన్ఫోసిస్ సీఈఓపై మరో ఆరోపణల లేఖ!
కూపన్ కోడ్‌లో పొరపాటు.. అమెజాన్‌ను ఖాళీ చేసిన వినియోగదారులు.. కోట్లాది రూపాయల నష్టం!
దూసుకుపోయిన మార్కెట్లు.. ట్రేడింగ్ ఆద్యంతం లాభాలే!
ముగిసిన పండుగ సీజన్... తగ్గిన బంగారం ధర
షియోమీ నుంచి సంచలన ఫోన్
2019లో భారత్ వృద్ధిరేటు 6.1 శాతం !.. ఐఎంఎఫ్ ముందస్తు అంచనా
మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1548432                      Contact Us || admin@rajadhanivartalu.com