తాజా వార్తలు ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌         'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్         తారీకు : 19-02-2020
 
దసరా కానుకగా కొత్త కారు తీసుకువచ్చిన మారుతి
మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎస్ ప్రెస్సో
ధర రూ.3.69 లక్షల నుంచి ప్రారంభం
రేనాల్ట్ క్విడ్ కు గట్టిపోటీ తప్పదంటున్న నిపుణులు
చిన్నకారు సెగ్మెంట్లో మరో కారు వచ్చింది. మారుతి సుజుకి సంస్థ తన పోర్ట్ ఫోలియోలో తాజాగా ఎస్ ప్రెస్సో కారును కూడా చేర్చింది. మినీ ఎస్ యూవీగా పిలవదగ్గ ఎస్ ప్రెస్సో కారు ఇవాళ మార్కెట్లో విడుదలైంది. దీని ధర రూ.3.69 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఎస్ యూవీ లుక్ తో ఉన్న ఎస్ ప్రెస్సో గతేడాది ఆటో ఎక్స్ పోలో ప్రదర్శితమైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని మారుతి అభిమానులు ఎదురుచూశారు. దసరా కానుకగా వచ్చిన ఈ కారు బీఎస్6 ప్రమాణాలతో తయారైంది. అంతర్జాతీయ బ్రాండ్ మినీకూపర్ తరహాలో ఎస్ ప్రెస్సో కారును డిజైన్ చేశారు.

సెక్యూరిటీ ఫీచర్ల పరంగా ఇది ఏ పెద్ద కారుకూ తీసిపోదు. డ్యూయల్ ఎయిర్ బాగ్, పార్కింగ్ సెన్సర్ (రియర్ వ్యూ)తో పాటు స్పీడ్ సెన్సర్ డోర్ లాకింగ్ సదుపాయాలు ఉన్నాయి. బాడీ డిజైన్ చూస్తుంటే అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తయారుచేసినట్టు కనిపిస్తున్నా, చిన్నపట్టణాల వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించారు. ఎస్ ప్రెస్సో రాకతో చిన్న కార్ల విభాగంలో రేనాల్ట్ క్విడ్ కు గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు.
చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి: విజయ్ మాల్యా
ఈ వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు
హీరో స్ప్లెండర్ ప్లస్ బీఎస్-6 మోడల్ ఎలా ఉందో చూడండి!
మార్కెట్లోకి బీఎస్-6 తో కూడిన ‘బజాజ్ పల్సర్ 150 బైక్’
‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఇండిగో ఎయిల్ లైన్స్ ప్రత్యేక ఆఫర్
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
భలే భలే బుల్లి కారు...యూపీ ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణ!
నా ఆస్తి విలువ సున్నా... చేతులెత్తేసిన అనిల్ అంబానీ!
భారత్‌లోని ఆటో పరిశ్రమను వణికిస్తున్న కరోనా వైరస్.. పరిశ్రమ వర్గాల ఆందోళన
మళ్లీ విధులకు హాజరవుతున్న చైనా ఉద్యోగులు, కార్మికులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1578292                      Contact Us || admin@rajadhanivartalu.com