తాజా వార్తలు ఏపీ సుభిక్షంగా ఉండాలని విజయవాడలో చతుర్వేద పారాయణం         నిబంధనలు అతిక్రమణ...జనసేన అనుబంధ ట్విట్టర్‌ ఖాతాలు సస్పెన్షన్‌         తారీకు : 22-09-2019
 
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త: రుణాలపై వడ్డీ మరో పది బేసిస్‌ పాయింట్ల తగ్గింపు
8.25 శాతం నుంచి 8.15 శాతానికి
ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు తగ్గించడం ఇది ఐదోసారి
అదే సమయంలో డిపాజిట్లపైనా వడ్డీ తగ్గింపు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. రుణాలపై వడ్డీ రేటును మరో 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా వడ్డీరేట్లు తగ్గించడం ఇది ఐదోసారి. ఏప్రిల్‌ 10 నుంచి ఇప్పటి వరకు 45 బేసిస్‌ పాయింట్లు మేర రుణ వడ్డీ భారం తగ్గింది. ఈనెల 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.

తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై ఇప్పటి వరకు 8.25 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా, ఇకపై 8.15 శాతం వసూలు చేస్తారు. అదే సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు తగ్గించింది. అన్ని కాలపరిమితులున్న రిటైల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిస్‌ పాయింట్లు, బల్క్‌ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్‌ పాయింట్లు మేర తగ్గించింది.

ఈ రేట్లు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఏడాది నుంచి రెండేళ్ల కాపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ 6.5 శాతానికి తగ్గింది.
ముంబైలోని దేనా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ను విక్రయానికి పెట్టిన బ్యాంక్ ఆఫ్ బరోడా!
కనీస నిల్వపై ఎస్బీఐ కీలక నిర్ణయాలు.. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు!
వారాంతాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగిన పొదుపు ఖాతాల జమ
10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.. ‘జొమాటో’ సంచలన ప్రకటన!
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త: రుణాలపై వడ్డీ మరో పది బేసిస్‌ పాయింట్ల తగ్గింపు
యాపిల్ కంపెనీ చైనా కార్మికుల శ్రమను దోచుకుంటోంది.. ఎన్జీవో సంస్థ సంచలన నివేదిక!
వారాన్ని లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు
రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే రూ.1.76 లక్షల కోట్లను ఏం చేస్తామో చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్!
నిస్సాన్ కు రాజీనామా చేయనున్న సీఈఓ!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1537038                      Contact Us || admin@rajadhanivartalu.com