తాజా వార్తలు సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి         ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ.. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారమే!         తారీకు : 14-12-2019
 
భగ్గుమన్న బంగారం ధర... పది గ్రాములు రూ. 37 వేలు!
అంతర్జాతీయ పరిణామాలతో ఆకాశానికి
బులియన్ మార్కెట్ వైపు ఇన్వెస్టర్ల మొగ్గు
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆరేళ్ల గరిష్ఠానికి ధర
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ వైపుకు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో యూఎస్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించిన తరువాత పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న ఈక్విటీల అమ్మకాలవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరాయి.

భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 800 పెరిగి రూ. 36,970కి చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1000 పెరిగి రూ. 43,100కు చేరుకుంది. డాలర్ తో రూపాయి మారకపు విలువ బలహీనపడటం కూడా బంగారం ధరను పెంచిందని బులియన్ పండితులు వ్యాఖ్యానించారు.

ఇక ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో ఫ్యూచర్స్ మార్కెట్ విషయానికి వస్తే, బంగారం, వెండి ధరలు 2 శాతం పెరిగి (అక్టోబర్ డెలివరీ) వరుసగా రూ. 36,977, రూ. 42,439కి చేరాయి. గ్లోబల్ మార్కెట్లలో సైతం బంగారం ధర ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి చేరి, ఔన్సు బంగారం ధర 1,459 డాలర్లకు చేరింది.
జియో కాల్, డేటా చార్జీల పెంపు.. ఇప్పటికే పెంచిన వొడాఫోన్, ఎయిర్ టెల్!
వివాహానికి దీర్ఘకాల రుణాలు.. ఆర్థిక సంస్థల మరో ముందడుగు
కార్వీపై ఎన్ఎస్ఈ వేటు.. ట్రేడింగ్ లైసెన్స్ సస్పెన్షన్
ఫ్లాట్ గా ముగిసిన నేటి మార్కెట్లు
ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు.. ఐటీకి నష్టాలు, బ్యాంకులకు లాభాలు
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ కు అన్యూహ్య స్పందన.. ఇప్పటి వరకు 70 వేల దరఖాస్తులు!
మనేసర్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేసిన హోండా!
ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యం... ఇన్ఫోసిస్ సీఈఓపై మరో ఆరోపణల లేఖ!
కూపన్ కోడ్‌లో పొరపాటు.. అమెజాన్‌ను ఖాళీ చేసిన వినియోగదారులు.. కోట్లాది రూపాయల నష్టం!
దూసుకుపోయిన మార్కెట్లు.. ట్రేడింగ్ ఆద్యంతం లాభాలే!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1557847                      Contact Us || admin@rajadhanivartalu.com