తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
ఆర్థిక క్రమశిక్షణ వీడవద్దు
ప్రభుత్వానికి ఆర్థిక సలహా మండలి లక్ష్మణ రేఖ
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ బాటను వీడవద్దని ప్రధాని ఆర్థిక సలహా మండలి హెచ్చరించింది. ఎన్డీయే పాలనలోకి వచ్చిన మూడున్నరేళ్ల విరామం తర్వాత గత నెలలో ఏర్పాటు చేసిన ఈసి-పిఎం తొలి సమావేశం బుధవారం జరిగింది. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ బాట నుంచి పక్కకు జరిగి పారిశ్రామిక రంగానికి ఉద్దీపనలు ప్రకటించడం మంచిది కాదని ఈని సూచించింది. ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించడం, ఉపాధి కల్పన సహా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన 10 అంశాలను గుర్తించింది. వివిధ స్థాయిల్లో విధానపరమైన చర్యలను సమీకృతం చేయడం ద్వారా పెట్టుబడులు, ఎగుమతులను ఉత్తేజితం చేయడం, ఆర్థిక వృద్ధిరేటును ఉరకలెత్తించడం వంటి సూచనలతో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు ఈ సమావేశంలో ఒక ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు ఆచరణీయం అయ్యే పరిష్కారాలను ప్రధానికి సూచిస్తామని ఈసి చైర్మన్‌ బిబెక్‌ దేబ్‌రాయ్‌ సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు.

పారిశ్రామిక రంగానికి ఉద్దీపనలు ప్రకటించడానికి ప్రభు త్వం విత్తలోటు లక్ష్యాన్ని దాటవచ్చునా అన్న ప్రశ్న కు ఎలాంటి పరిస్థితుల్లోను ఆర్థిక క్రమశిక్షణ బాటను వీడవద్దనే విషయంలో కౌన్సిల్‌ సభ్యులందరిలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు మూడేళ్ల కనిష్ఠ స్థాయి 5.7 శాతానికి దిగజారినందు వల్ల తమను ఆదుకునేందుకు ఉద్దీపనలు ప్రకటించాలని పారిశ్రామిక రంగం కోరుతోంది. నవంబరులో ఈసి మరోసారి సమావేశంకానుంది. ఆర్థిక రంగంలో పునరుజ్జీవం తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో తాము సమావేశాలు కూడా నిర్వహిస్తామని, నవంబరు సమావేశం అనంతరం సవివరమైన నివేదిక అందిస్తామని దేబ్‌రాయ్‌ తెలిపారు.

ఈసి గుర్తించిన ప్రాధాన్య అంశాలు
ఆర్థిక వృద్ధి, ఉద్యోగాలు-ఉపాధి కల్పన, అవ్యవస్థీకృత రంగం-అనుసంధానం, విత్త నిర్వహణ, ద్రవ్య విధానం, ప్రభుత్వ వ్యయం, ఆర్థిక నిర్వహణ సంస్థలు, వ్యవసాయం-పశు సంవర్థకం, వినియోగ ధోరణులు, ఉత్పత్తి, సామాజిక రంగం.
బీఎండబ్ల్యూ కొత్త ‘గ్రాన్‌ టురిస్మో ఎం స్పోర్ట్‌’
కంటెంట్‌పై బాధ్యత వాటిదే
ఈ రోజు ధన త్రయోదశి.. కిటకిటలాడుతున్న బంగారం దుకాణాలు!
4జీ వీఓఎల్‌టీఈ ఫీచ‌ర్ ఫోన్‌ను ఆవిష్క‌రించిన బీఎస్ఎన్ఎల్‌... ధ‌ర రూ. 2,200
దివాళి ఆఫర్‌ : కార్లపై భారీ డిస్కౌంట్లు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
రిలయన్స్ దూసుకొస్తోంది.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ఇక పెద్ద పోటీనే!
స్టాక్‌ మార్కెట్లో థౌజండ్‌వాలా
ఆధార్‌ లింక్‌ చేశారా?
బంగారం దిగుమతులు రెండింతలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146252                      Contact Us || admin@rajadhanivartalu.com