తాజా వార్తలు మేం వద్దన్నా.. కోడి పందేలా?         నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన         తారీకు : 23-01-2018
 
హ్యుందాయ్‌ ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌
ప్రారంభ ధర రూ.7.99 లక్షలు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్‌’ తాజాగా ‘వెర్నా’లో కొత్త వెర్షన్‌ను (ఐదో జనరేషన్‌) మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉంది. మిడ్‌సైజ్డ్‌ సెడాన్‌ విభాగంలో తిరిగి అధిక మార్కెట్‌ వాటాను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది. ఈ ఐదో జనరేషన్‌ వెర్నా ప్రధానంగా హోండా సిటీ, మారుతీ సుజుకీ సియాజ్‌ మోడళ్లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని పెట్రోల్‌ వేరియంట్స్‌ ధర రూ.7.99 లక్షలు–రూ.12.23 లక్షల శ్రేణిలో, డీజిల్‌ వేరియంట్స్‌ ధర రూ.9.19 లక్షలు–రూ.12.61 లక్షల శ్రేణిలో ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఇక ఈ వాహనాలకు సంబంధించి నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) ఎండీ, సీఈవో వై.కె.కో తెలిపారు. కాగా పైన పేర్కొన్న కార్ల ధరలు తొలి 20,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని, తర్వాత వాహన ధరలను పెంచుతామని హెచ్‌ఎంఐఎల్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) రాకేశ్‌ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కొత్త వెర్షన్‌ వెర్నాలో 1.6 లీటర్‌ పెట్రోల్‌/డీజిల్‌ ఇంజిన్స్, మాన్యువల్‌/ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్, సన్‌రూఫ్, స్టాండర్డ్‌ డ్యూయెల్‌ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించారు.
ఆదాయ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు పెంచాలి
21 రోజుల్లో భూమి కేటాయింపు
భారత్‌ చక్రం తిప్పాలి
జోరుగా సాగిన దేశీయ మార్కెట్లు...ఆల్‌టైం రికార్డును సాధించిన సెన్సెక్స్‌!
నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియోలు చూసేందుకు ఓ థియేట‌ర్‌!
అదిరే ఆఫర్... ఒక్క రూపాయికే అపరిమిత డేటా!
స్క్రీన్ మీదే ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌.. వివో కొత్త ఫోన్!
ఎన్నికల ఫలితాలు, క్రూడ్‌ ధరలు కీలకం
దిగుమతి చేసుకోవటం ఎలా ?
ఏడాదిలో రూ.2 లక్షల కోట్లు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :199852                      Contact Us || admin@rajadhanivartalu.com