తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
షేర్ల బైబ్యాక్‌ సైజు పెంచాలి
♦ ఈ చర్య ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతుంది
♦ మూర్తిపై బోర్డు నిందలు తప్పులను కప్పిపుచ్చుకోవడమే
♦ ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో బాలకృష్ణన్‌

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌ కంపెనీ ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌ మొత్తం చాలదని ఆ సంస్థ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. తాజా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు బైబ్యాక్‌ పరిమాణాన్ని పెంచాలని ఆయన సూచించారు. ‘‘రూ.13,000 కోట్ల విలువ మేర షేర్ల బైబ్యాక్‌ ప్రకటించిన సమయం అసాధారణమైనది. ఒక్కో షేరుకు రూ.1,150 అన్నది సరైనదే. కానీ, మరింత ధరను నిర్ణయించాల్సి ఉంది. రూ.1,200 ధర ఇన్వెస్టర్లలో తగినంత నమ్మకాన్ని కలిగించగలదు’’ అని బాలకృష్ణన్‌ పేర్కొన్నారు.

విశాల్‌ సిక్కా ఎండీ, సీఈవో పదవులకు రాజీనామా చేసిన మరుసటి రోజు ఇన్ఫోసిస్‌ బోర్డు, ఒక్కో షేరును రూ.1,150 చొప్పున 11.3 కోట్ల షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయాలని (బైబ్యాక్‌) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఈవో బయటకు వెళ్లిపోవడం, వ్యవస్థాపకులతో వివాదం సమసిపోని అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్ఫోసిస్‌ బోర్డు కేవలం బైబ్యాక్‌ను ప్రకటించి ఊరుకోవడం సరికాదని బాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. బైబ్యాక్‌ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానన్నారు. అమెరికాలో నాలుగు న్యాయ సంస్థలు ఇన్ఫోసిస్‌పై విచారణ మొదలుపెట్టినందున బైబ్యాక్‌పై దాని ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.

క్లాస్‌ యాక్షన్‌ సూట్‌ను దాఖలు చేయాలా అన్నదానిపై అమెరికా న్యాయ సంస్థలు విచారణ చేస్తున్నాయని, ఈ ప్రక్రియలో భాగంగా లాసూట్‌ దాఖలు చేసే ముందు తగిన మద్దతు సమీకరిస్తాయని వివరించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే: సీఈవోగా సిక్కా తప్పుకోవడంతో కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిపై బోర్డు నిందలు వేయడం తన స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకేనని బాలకృష్ణన్‌ ఆరోపించారు.

కఠిన పరిస్థితులను తట్టుకోగలం: సీఈవో
ఇన్ఫోసిస్‌నీలో అనిశ్చితి ఉద్యోగులపై ప్రభావం చూపించకుండా కంపెనీ తాత్కాలిక సీఈవో, ఎండీ యూబీ ప్రవీణ్‌రావు ఉద్యోగులకు ఈ మెయిల్‌ పంపారు. కంపెనీ తాజా పరిణామాలను తట్టుకుని నిలబడగలుగుతుందని భరోసా ఇచ్చారు. ముందున్న ప్రయాణం అంత సులభం కాదని, అయినప్పటికీ తమ విధులపై దృష్టి సారించాలని ఉద్యోగులను ప్రవీణ్‌రావు కోరారు. ఈ తరహా కఠిన సవాళ్లు ఇన్ఫోసిస్‌కు ఇదే మొదటి సారి కాదని, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, నాయకత్వం కంపెనీ నుంచి వెళ్లిపోవడం వంటివి గతంలో ఎదుర్కొన్నవేనని, వాటిని తట్టుకుని నిలబడిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు.

ట్రేడింగ్‌ ఖాతాలు ఆధార్‌తో లింక్‌ కావాల్సిందే: సెబీ
ఇన్ఫోసిస్‌ షేరు కదలికలను తాము పరిశీలిస్తున్నట్టు సెబీ తెలిపింది. గత శుక్రవారం ఇన్ఫోసిస్‌ షేరు 10 శాతం నష్టపోగా, సోమవారం మరో 5 శాతం తగ్గిన విషయం తెలిసిందే. దీనిపై సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి స్పందిస్తూ ఇన్ఫోసిస్‌ షేరు ధరలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. ట్రేడింగ్‌ ఖాతాలను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానానికి విధించిన డిసెంబర్‌ గడువుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డిసెంబర్‌ 31 నాటికి ఆధార్‌తో అనుసంధానం కాని వాటిని ఆ వివరాలు ఇచ్చేంత వరకు సస్పెన్షన్‌లో ఉంచనున్నట్టు త్యాగి చెప్పారు. నల్లధన ప్రవాహం, పన్నుల ఎగవేతను అరికట్టేందుకే ఈ చర్య అని చెప్పారు. క్లయింట్ల ఆధార్‌ వివరాలు అందించేందుకు గల సన్నద్ధత గురించి ఈ నెల 23 నాటికి వివరాలు తెలియజేయాలని గత వారం బీఎస్‌ఈ ట్రేడింగ్, క్లియరింగ్‌ సభ్యులను ఆదేశించిన విషయం తెలిసిందే.
మార్కెట్‌ విలువలో టాప్‌–10 నుంచి ఇన్ఫోసిస్‌ ఔట్‌
ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ సీఈఓ సిక్కా అర్థాంతరంగా వైదొలగడం, ఈ పరిణామ నేపథ్యంతో ఇన్ఫోసిస్‌ షేరు మార్కెట్‌ విలువ రూ. 2.01,074 కోట్లకు పడిపోయింది. దాంతో అత్యధిక మార్కెట్‌ విలువకలిగిన టాప్‌–10 కంపెనీల జాబితాలో ఇన్ఫీకి స్థానం లేకుండా పోయింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో మార్కెట్‌ విలువరీత్యా ఇన్ఫోసిస్‌ 11వ స్థానానికి దిగిపోయింది. వరుసగా రెండురోజుల్లో రూ. 33,911 కోట్ల విలువను కంపెనీ కోల్పోయింది. రూ. 5.08 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానంలో వుండగా, టీసీఎస్‌ (రూ. 4.78 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.4.51 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 3.45 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ. 2.79 లక్షల కోట్లు), హెచ్‌యూఎల్‌ (రూ. 2.60 లక్షల కోట్లు), ఎస్‌బీఐ (రూ. 2.37 లక్షల కోట్లు), మారుతి సుజుకి (రూ.2.27 లక్షల కోట్లు), ఐఓసీ (రూ. 2.05 లక్షల కోట్లు), ఓఎన్‌జీసీ (రూ. 2.04 లక్షల కోట్లు) తర్వాతి స్థానాల్లో వున్నాయి.

జైట్లీతో ఇన్ఫోసిస్‌ కో–చైర్మన్‌ రవి భేటీ
ఇన్ఫోసిస్‌ సహ చైర్మన్‌ రవి వెంకటేశన్‌ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాల్‌ సిక్కా అనూహ్యంగా కంపెనీ ఎండీ, సీఈవో పదవుల నుంచి తçప్పుకున్న అనంతరం ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇన్ఫోసిస్‌లో జరుగుతున్న పరిణామాలు, వాటాదారులకు సంబంధించి తీసుకున్న చర్యల్ని వెంకటేశన్‌ వెల్లడించారు.
మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
శుభవార్త... చుక్కలనంటిన 'పెట్రో' ధరలను తగ్గించే యోచనలో కేంద్రం!
లాభాలతో ప్రారంభమై.. చివరకు బేర్ మన్న మార్కెట్లు
మళ్లీ కోర్టుకు జియో... ఎయిర్ టెల్ పై 'ఐపీఎల్' వార్!
ఐదు రోజలు నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
లాభ నష్టాల ఊగిసలాట
ముడిచమురు, ఫలితాలు ‘మార్కెట్‌’కు దిశానిర్దేశం
కోచింగ్‌ సెంటర్లపై 18% జీఎస్టీ: ఏఏఆర్‌
జీమెయిల్ కు అంతరాయం... యూజర్లకు కష్టాలు!
భారత్‌లో ఆభరణాల డిమాండ్‌కు ఢోకాలేదు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275480                      Contact Us || admin@rajadhanivartalu.com