తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
ఇన్వెస్టర్లే బకరాలు
డొల్ల కంపెనీల మాయాజాలం
ముంబై: తిమ్మిని బమ్మిని చేయడం ఇంద్రజాలం. కొంత మంది ప్రమోటర్లు వీరిని మించి పోయారు. తమ టక్కు టమార విద్యలతో పైసాకూ పనికిరాని కంపెనీల షేర్లనూ భారీ ధరలకు ఇన్వెస్టర్లకు అంటగడుతూ ‘లాభాల’ పండగ చేసుకుంటున్నారు. గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఫార్మా, ఫ్లోరీకల్చర్‌, గ్రానైట్‌, అక్వా పేర్లతో అనేక కంపెనీలు మార్కెట్‌కు వచ్చాయి. వాటి ప్రచారాన్ని నమ్మి ఆ కంపెనీల షేర్లు కొన్న ఇన్వెస్టర్లు లబోదిబోమంటూ ఏడుస్తుంటే, ప్రమోటర్లు మాత్రం సైలెంట్‌గా దుకాణాలు ఎత్తేశారు. ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా ఆ కంపెనీల పేర్లు కనిపించవు.

ఆ ఇష్యూల ద్వారా సమీకరించిన వందల కోట్ల నిధులు, ఆస్తులు దర్జాగా ప్రమోటర్ల జేబుల్లోకి చేరిపోయాయి. వారి మాయ మాటలు నమ్మి ఆ ఇష్యూల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లకు మాత్రం ఏడుపొక్కటే మిగిలింది. ప్రమోటర్లు మోసం గురించి తెలిసినా ప్రభుత్వంగానీ, స్టాక్‌ మార్కెట్‌ వాచ్‌డాగ్‌ సెబిగానీ ఈ బడా కేటుగాళ్లపై ఒక్క చర్య కూడా తీసుకోలేక పోయాయి.

భారత స్టాక్‌ మార్కెట్లో ఎప్పటి నుంచో ఈ గూడు పుఠాని నడుస్తోంది. బిజినెస్‌ లేకపోయినా తప్పుడు చిరునామాలు, తప్పుడు రిటర్న్‌లతో ఈ కంపెనీలు ఇప్పటి వరకు నెట్టుకొచ్చాయి. ఇన్వెస్టర్ల అమాయకత్వమే ఈ కంపెనీల ప్రమోటర్లకు శ్రీరామ రక్ష. ఇక్కడ రిటైల్‌ ఇన్వెస్టర్లతో పాటు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి బిగ్‌బుల్‌నీ ఈ కేటుగాళ్లు నమ్మించారంటే, ఈ మోసాల్లో ఎంత ముదిరిపోయారో అర్థం చేసుకోవచ్చు. స్టాక్‌ మార్కెట్లో దీన్నే ‘గ్రేట్‌ ఫూల్‌ థియరీ’ అంటారు.

ఏ మాత్రం ఫండమెంటల్స్‌ లేకపోయినా ఒక కంపెనీ షేర్లను తక్కువ ధరకు కొని, మార్కెట్‌ను ఏదోలా మాయ చేసి మరో ఇన్వెస్టర్‌కు అఽధిక ధరకు అమ్ముకుని భారీ లాభాలు కళ్లజాడడమే గ్రేట్‌ ఫూల్‌ థియరీ. ఇలాంటి కేటుగాళ్లకు ఇటీవల ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లేదా చాట్‌ గ్రూపులు వేదికలుగా మారాయి. కొన్ని బ్రోకరేజ్‌ సంస్థలకూ ఇందులో పాత్ర ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థలు ఈ డొల్ల కంపెనీల షేర్లు ఇన్వె్‌స్టమెంట్‌కు బాగున్నాయి. త్వరగా కొనుక్కోండి అని ఎస్‌ఎంఎ్‌సలు పంపి మరీ కొనిపించినట్టు సమాచారం.

అడ్డగోలుగా పెరుగుదల
గత జనవరి నుంచి ఈ డొల్ల కంపెనీల్లో కొన్ని కంపెనీల షేర్లు అడ్డగోలుగా పెరిగిపోయాయి. సెబి డొల్ల కంపెనీగా పేర్కొన్న ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ షేరు ధర ఏకంగా 208 శాతం పెరిగింది. పార్శ్వనాథ్‌ డెవలపర్స్‌ షేరు ధరా 82 శాతం పెరిగింది. జెకుమార్‌ ఇన్‌ఫ్రా షేరు ధరా 38 శాతం లాభపడింది. ఇప్పుడు సెబి తీసుకున్న చర్యలతో ఈ కంపెనీల షేర్లలో చిక్కుకు పోయిన ఇన్వెస్టర్లు మరిన్ని కష్టాల్లో పడ్డారు. ఇవి డొల్ల కంపెనీలన్న ముద్రతో వీటి ధర మరింత పడిపోయే ప్రమాదం ఏర్పడింది.

31 లక్షల మంది
సెబి తాజాగా 331 కంపెనీలు డొల్ల కంపెనీలంటూ ఒక జాబితా విడుదల చేసింది. ఈ కంపెనీల షేర్లలో ట్రేడింగ్‌నూ నెలకు ఒక్క రోజుకే పరిమితం చేయాలని సెబి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లనూ ఆదేశించింది. దీంతో ఈ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్‌ చేసిన 31 లక్షల మంది ఇన్వెస్టర్లు ఇప్పుడు పెద్ద ఊబిలో కూరుకు పోయారు. ఈ కంపెనీల షేర్ల విలువ ఎంత లేదన్నా రూ.9,000 కోట్ల వరకు ఉం టుందని అంచనా.
బీఎండబ్ల్యూ కొత్త ‘గ్రాన్‌ టురిస్మో ఎం స్పోర్ట్‌’
కంటెంట్‌పై బాధ్యత వాటిదే
ఈ రోజు ధన త్రయోదశి.. కిటకిటలాడుతున్న బంగారం దుకాణాలు!
4జీ వీఓఎల్‌టీఈ ఫీచ‌ర్ ఫోన్‌ను ఆవిష్క‌రించిన బీఎస్ఎన్ఎల్‌... ధ‌ర రూ. 2,200
దివాళి ఆఫర్‌ : కార్లపై భారీ డిస్కౌంట్లు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
రిలయన్స్ దూసుకొస్తోంది.. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు ఇక పెద్ద పోటీనే!
స్టాక్‌ మార్కెట్లో థౌజండ్‌వాలా
ఆధార్‌ లింక్‌ చేశారా?
బంగారం దిగుమతులు రెండింతలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146289                      Contact Us || admin@rajadhanivartalu.com