అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్.
|
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు.క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు.
అమెరికా సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా,మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఈ అభిశంసన తీర్మానాన్ని సభ్యులు..సెనెట్‌కు పంపనున్నారు.ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు.అనంతరం డొనాల్డ్ ట్రంప్‌పై విచారణ జరగనుంది.
|
|
|