తాజా వార్తలు ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం         రెచ్చగొట్టి అలజడులకు కుట్ర         తారీకు : 05-12-2020
 
5 వేల కిలోల బాంబు పేలుడు.
వార్సా: రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన భారీ బాంబు పోలాండ్‌ కాలువలో పేలిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టాల్‌బాయ్‌ లేదా భూకంపంగా పిలిచే ఈ బాంబు దాదాపు 5వేల కిలోల ఉంటుందని అక్కడి నేవీ అధికారులు తెలిపారు. రెండవ ప్రపంచ యుద్దం నాటి ఈ బాంబును మంగళవారం బాల్టిక్‌ సముద్రం సమీపంలోని కాలువలో నిర్వీర్యం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ క్రూయిజర్‌ లుట్జోపై దాడి చేసేందుకు బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబును పొలాండ్‌లో వదిలినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ బాంబు‌ అక్కడే ఉందని నేవీ అధికారులు తెలిపారు. దీనిపై నేవీ అధికారి మాట్లాడుతూ.. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావించి నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో బాంబును మంగళవారం స్వీనోజ్‌సై ప్రాంతంలోని పియూస్ట్‌ కాలువలో నిర్వీర్యం చేస్తుండగా పేలినట్లు వెల్లడించారు. దీన్ని నిర్వీర్యం చేసే సమయంలో కాలువ సమీపంలో నివసించే 750 మందిని అక్కడి నుంచి తరలించారు. ఈ బాంబు దాదాపు 5400 కిలోల బరువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై కూడా దీనివల్ల ఎలాంటి ముంపు ఉండదని ఆయన స్ఫష్టం చేశారు.
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా క్లెయిన్‌
ఫైజర్‌ ప్రయోగాల్లో అపశ్రుతి
అధికార మార్పిడికి ట్రంప్‌ మోకాలడ్డు!
రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ తొలగింపు
ఇవే బైడెన్‌ ప్రాథమ్యాలు..!
చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌
అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం
100 మందిపై స్పుత్నిక్‌–వీ ప్రయోగం
ఉ. కొరియా ప్రజల గుండెల్లో గుబులు.. ఎల్లోడస్ట్‌తో కరోనా?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1649846                      Contact Us || admin@rajadhanivartalu.com