తాజా వార్తలు ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం         రెచ్చగొట్టి అలజడులకు కుట్ర         తారీకు : 05-12-2020
 
డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడికి కరోనా..
వాషింగ్టన్‌: అమెరికా అధక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు బారన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని యూఎస్‌ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ బుధవారం వెల్లడించారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షలో బారన్‌కు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. బారన్‌ ప్రస్తుతం టీనేజర్ కావడంతో ఎటువంటి లక్షణాలు లేవని మెలానియా తెలిపారు. అక్టోబర్ 2న ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారితో పాటు వైట్ ‌హౌజ్‌లోని సిబ్బంది కొందరికి కరోనా వచ్చింది. మూడు రోజుల పాటు సైనిక ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం వైట్‌హౌస్‌కు చేరుకున్న ట్రంప్‌ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత వారు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
బుధవారం నాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, "నా చిన్న కుమారుడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని చెప్పారు. వైరస్‌ తనకు చాలా స్వల్ప కాలం కనిపించిందని, బహుశా అతడికి ఈ వైరస్ సోకిందని కూడా తెలిసి ఉండదన్నారు. బారన్‌ రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల ప్రమాదం లేదన్నారు. కాగా మెలానియా ట్రంప్‌ తనకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని, అతి త్వరలోనే ప్రథమ మహిళ బాధ్యతలను తిరిగి మొదలుపెడతానని ఆమె చెప్పారు. కరోనా సోకిన తరువాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నానని పేర్కొన్నారు. అదే విధంగా ముగ్గురికి ఒకేసారి కరోనా సోకడం ఆనందంగా ఉందని.. ఎందుకంటే ఒకరినొకరు చూసుకుంటామని, కలిసి సమయం గడపవచ్చునని మెలానియా తెలిపారు.
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా క్లెయిన్‌
ఫైజర్‌ ప్రయోగాల్లో అపశ్రుతి
అధికార మార్పిడికి ట్రంప్‌ మోకాలడ్డు!
రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ తొలగింపు
ఇవే బైడెన్‌ ప్రాథమ్యాలు..!
చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌
అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం
100 మందిపై స్పుత్నిక్‌–వీ ప్రయోగం
ఉ. కొరియా ప్రజల గుండెల్లో గుబులు.. ఎల్లోడస్ట్‌తో కరోనా?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1649840                      Contact Us || admin@rajadhanivartalu.com