తాజా వార్తలు పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి         డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా         తారీకు : 21-10-2020
 
ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్.
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించనిషాక్ తగిలింది. ఎయిరిండియా విమానంలో తమ దేశానికి చేరిన ప్రయాణీకుడి కరోనా పాజిటివ్ రావడంతో హాంకాంగ్‌ ప్రభుత్వం విమానాల రాకపోకలను మరోసారి నిషేధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు హాంకాంగ్‌కు ఎయిరిండియా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికులకు కోవిడ్-19పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆగస్టు18న హాంకాంగ్ ఎయిర్ ఇండియా విమానాలను ఆగస్టు 31వరకు సస్పెండ్ చేసింది. ఇది రెండో నిషేధం.
ఈ నెల 18న హాంకాంగ్ వెళ్లిన ఐదుగురు భారతీయులు కరోనా బారినపడ్డారు. వీరంతా కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లినట్టుగా తేలింది. ముందుగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌తో ప్రయాణం చేసినప్పటికీ వారికి వ్యాధి నిర్ధారణ జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు రెండు వారాలు నిషేధాన్ని విధిస్తున్నట్టు హాంకాంగ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. కాగా ఇదే ఆరోపణలతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను అక్టోబర్ 2 వరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
భారత్‌పై ట్రంప్‌ విమర్శలు
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
వలసదారులందరికీ పౌరసత్వం.
5 వేల కిలోల బాంబు పేలుడు.
డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడికి కరోనా..
ట్రంప్‌కి కరోనా నెగెటివ్‌.
కిమ్‌ కంట కన్నీరు.
భారత వైద్యుడికి చైనా నివాళి!
కరోనాని అంతం చేస్తాం.
10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1639147                      Contact Us || admin@rajadhanivartalu.com