తాజా వార్తలు పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి         డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా         తారీకు : 21-10-2020
 
‘కోవిడ్‌’ పెరగుతున్నా మరణాలు ఎందుకు తక్కువ!
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజు రోజుకు అప్రతిహతంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోండడం ఉపశమనం కలిగిస్తోంది. ఎందుకు మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది ? సకాలంలో చికిత్స తీసుకోవడం వల్లన మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందా? వైరస్‌ ప్రభావం నిర్వీర్యం అవుతూ వస్తోందా ? వాతావరణ పరిస్థితులు వైరస్‌పై ప్రభావం చూపిస్తున్నాయా? మృతుల సంఖ్యను ఉద్దేశ పూర్వకంగానే పాలనా యంత్రాంగాలు ప్రజలకు తెలియజేయకుండా దాస్తున్నాయా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ఇంగ్లండ్, వేల్స్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన వారి డేటాను తెప్పించుకొని పరిశోధకులు విశ్లేషించారు. కోవిడ్‌ వైరస్‌ పట్ల అవగాహన పెరగడంతో మధ్య వయస్కులు, వృద్ధులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే సార్వజనీయ స్థలాలకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నిండం లాంటి జాగ్రత్తలు. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు క్రమానుగతంగా ఎత్తి వేస్తుండడం వల్ల ఉద్యోగం కోసం, ఉపాధి కోసం లేదా ఉల్లాసం కోసం యువత ఎక్కువగా బయటకు వెళుతోంది. ఫలితంగా యువతనే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతోంది.
అవగాహన పెరగడంతో బయటకు వెళ్లి వస్తోన్న యువత, వృద్ధ తరానికి దూరంగా ఉండడం లేదా వారే యువతరానికి దూరంగా మసలడం వల్ల వృద్ధతరంలో కోవిడ్‌ కేసులు తగ్గుతూ వస్తోన్నాయి. కరోనా బారిన పడిన వారిలో యువతలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉండగా, వృద్ధతరంలో ఎక్కువగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ కారణంగానే రోజు రోజుకు కోవిడ్‌ కేసులు పెరగుతున్నా మరణాలు తగ్గుతున్నాయి. ఇక మృత్యు బారిన పడుతున్న మధ్య వయస్కుల్లో ఎక్కువ మంది ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారే ఉన్నారు.
భారత్‌పై ట్రంప్‌ విమర్శలు
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
వలసదారులందరికీ పౌరసత్వం.
5 వేల కిలోల బాంబు పేలుడు.
డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడికి కరోనా..
ట్రంప్‌కి కరోనా నెగెటివ్‌.
కిమ్‌ కంట కన్నీరు.
భారత వైద్యుడికి చైనా నివాళి!
కరోనాని అంతం చేస్తాం.
10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1639151                      Contact Us || admin@rajadhanivartalu.com