తాజా వార్తలు పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి         డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా         తారీకు : 21-10-2020
 
టిక్‌టాక్, వీ చాట్‌లపై అమెరికా నిషేధం.
వాషింగ్టన్‌: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్‌ టాక్, వీ చాట్‌ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషే«ధించిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్‌ 15లోపు, టిక్‌ టాక్, వీ చాట్‌ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్‌ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ చెప్పారు. టిక్‌ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్‌ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
భారత్‌పై ట్రంప్‌ విమర్శలు
బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
వలసదారులందరికీ పౌరసత్వం.
5 వేల కిలోల బాంబు పేలుడు.
డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడికి కరోనా..
ట్రంప్‌కి కరోనా నెగెటివ్‌.
కిమ్‌ కంట కన్నీరు.
భారత వైద్యుడికి చైనా నివాళి!
కరోనాని అంతం చేస్తాం.
10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1639146                      Contact Us || admin@rajadhanivartalu.com