తాజా వార్తలు డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి         విశాఖ మన్యంలో హైఅలర్ట్         తారీకు : 23-09-2020
 
విష ప్రయోగం నుంచి కోలుకుని...
బెర్లిన్‌: విష ప్రయోగానికి గురైయిన రష్యా విపక్ష నేత అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు అలెక్సీ నావల్నీ కోలుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం జర్మనీలోని బెర్లిన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫోటోని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆగస్ట్‌ 20న సైబీరియా నుంచి బెర్లిన్‌ వస్తుండగా నావల్నీ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయనను మార్గంమధ్యలో జర్మనీలో విమానాన్ని అత్యవసరంగా దింపి ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌ సాయం లేకుండా నావల్నీ శ్వాస తీసుకుంటున్నారు.

కాగా నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్‌స్క్‌ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్‌స్క్‌ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు.
కోవిడ్‌ శాంపిల్‌ కోసం రోబో
ఆమెకు అప్ఘనిస్తాన్‌ తల వంచింది
బెల్జియం రాకుమారి సైనిక శిక్షణ
ఇరాన్‌పై ఆంక్షల్ని పునరుద్ధరించిన అమెరికా.
అధ్యక్ష ఎన్నికల తర్వాతే నూతన జడ్జి నియామకం.
ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్.
దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం.
‘కోవిడ్‌’ పెరగుతున్నా మరణాలు ఎందుకు తక్కువ!
టిక్‌టాక్, వీ చాట్‌లపై అమెరికా నిషేధం.
యూకేలో మళ్లీ కరోనా విజృంభణ.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1630837                      Contact Us || admin@rajadhanivartalu.com