తాజా వార్తలు ‘బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపి చైర్మన్‌ తప్పు చేశారు’         బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదు: మండలి చైర్మన్‌         తారీకు : 27-01-2020
 
భారత్ లోనే తొలిసారి.. కులం, మతం లేదని సర్టిఫికెట్ అందుకున్న యువతి!
తమిళనాడుకు చెందిన స్నేహ రికార్డు
సర్టిఫికెట్ జారీచేసిన అధికారులు
హర్షం వ్యక్తం చేసిన స్నేహ
కులం, మతం కంటే మానవత్వం గొప్పదని చెబుతారు. దీన్ని ఆచరణలో పెట్టిన ఓ యువతి తాను ఏ కులం, మతానికి చెందిన వ్యక్తిని కాదని సర్టిఫికెట్ పొందింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పతూర్ లో చోటుచేసుకుంది.

తిరుప్పతూర్ మండలంలోని ఎం.ఎ.స్నేహను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా పెంచారు. దీంతో ఆమె పాఠశాల నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల వరకూ అన్నింటిలో కులం, మతం కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారు. ఈ క్రమంలోనే తనకు కులం, మతం లేదనీ, భారతీయురాలిగా సర్టిఫికెట్ జారీచేయాల్సిందిగా కోరారు. అయితే రకరకాల సాకులు చెబుతూ ఇందుకు అధికారులు నిరాకరిస్తూ వచ్చారు.

చివరికి ఈ విషయం తెలుసుకున్న తిరుప్పతూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పంకజమ్ వెరిఫికేషన్ చేయించారు.ఇందులో యువతి చెప్పిన వివరాలన్నీ నిజమని తేలడంతో ఆమెకు కులం, మతం లేదని సర్టిఫికెట్ జారీచేయాలని ఆదేశించారు.

దీంతో ఈ నెల 5న స్నేహకు అధికారులు ‘ఎలాంటి కులం మతం లేదని సర్టిఫికెట్ జారీచేశారు. దీనిపై స్నేహ హర్షం వ్యక్తం చేశారు. స్నేహ భర్త పార్తీబ రాజా మాట్లాడుతూ.. తమ ముగ్గురు కుమార్తెల స్కూల్ దరఖాస్తుల్లో కూడా కులం, మతం ప్రస్తావన తీసుకురాలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ తరహా సర్టిఫికెట్ ను దేశంలో అందుకున్న తొలి వ్యక్తి స్నేహానేనని అధికారులు చెబుతున్నారు.
Kissinger: World War III will come and Muslims will turn to ashes ...
మహారాష్ట్రలోని నాందేడ్‌, సోలాపూర్‌ ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్లతో పేల్చి, కూల్చేసిన అధికారులు!
అనంత్ అంబానీకి అరుదైన గౌరవం ఇచ్చిన ఉత్తరాఖండ్!
వెరీ వెరీ బ్యాడ్.. 'భారత్-పాక్' మధ్య పరిస్థితిపై డొనాల్డ్ ట్రంప్ స్పందన
భారత్ లోనే తొలిసారి.. కులం, మతం లేదని సర్టిఫికెట్ అందుకున్న యువతి!
పాకిస్థాన్‌లో సివిల్‌ న్యాయమూర్తిగా హిందూ మహిళ సుమన్‌కుమారి
ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం.. ప్రకటించిన కమలహాసన్!
రాహుల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరానన్న యువతి!
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1573036                      Contact Us || admin@rajadhanivartalu.com