తాజా వార్తలు మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్         అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!         తారీకు : 28-09-2020
 
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
అహ్మదాబాద్‌: ఉక్కు మనిషి, భారత ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు. అనంతరం పటేల్‌ 143వ జయంతి సందర్భంగా ఈ భారీ విగ్రహం వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ నిర్మించారు. 2013 అక్టోబర్‌ 31 న ప్రధాని మోదీ ఐక్యతా విగ్రహనిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు.
30 పవిత్ర నదీ జలాలతో పటేల్‌ విగ్రహానికి అభిషేకం చేశారు. 37 మంది సర్దార్‌ పటేల్‌ కుటుంబ సభ్యులు ఈ విగ్రహ ఆవష్కరణ మహోత్సవంలో పాల్గొన్నారు. పటేల్‌ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. కాగా, స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు సర్దార్‌ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో సహజ వనరులను నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.
యూఎన్‌ సర్వసభ్య సమావేశంలో చేదు అనుభవం
నీటిలోని టాక్సిన్స్ వ‌ల్లే ఏనుగులు మృతి
ట్రంప్‌ వైపు ఇండియన్‌ అమెరికన్లు మొగ్గు.
ఊహించని ట్విస్ట్‌ మైండ్‌బ్లాక్‌ అవడం‌ ఖాయం
కోవిడ్‌ శాంపిల్‌ కోసం రోబో
ఆమెకు అప్ఘనిస్తాన్‌ తల వంచింది
బెల్జియం రాకుమారి సైనిక శిక్షణ
ఇరాన్‌పై ఆంక్షల్ని పునరుద్ధరించిన అమెరికా.
అధ్యక్ష ఎన్నికల తర్వాతే నూతన జడ్జి నియామకం.
ఎయిరిండియాకు మరోసారి కరోనా షాక్.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1632350                      Contact Us || admin@rajadhanivartalu.com