తాజా వార్తలు కోడి పందాలపై పోలీసుల దాడులు.. భారీగా కోళ్లు, సొమ్ము స్వాధీనం         ఎన్నికలకు ముందు జగన్ ఘోర తప్పిదం: గంటా శ్రీనివాస్         తారీకు : 18-01-2019
 
మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికాకు వెళ్లనున్న గోవా సీఎం
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్
ఇప్పటికే రెండుసార్లు ముంబై ఆసుపత్రిలో చేరిన సీఎం
అమెరికా వెళ్తున్నట్టు గవర్నర్‌కు లేఖ
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (62) మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికా వెళ్లనున్నారు. ఈ మేరకు గోవా గవర్నర్ మృదుల్ సిన్హాకు పారికర్ లేఖ రాశారు. మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్టు తెలిపారు. ముంబై, గోవా వైద్య నిపుణుల సూచన మేరకు తాను గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

స్వల్ప అస్వస్థత కారణంగా గత నెల 15న పారికర్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు అక్కడ చికిత్స అందించిన వైద్యులు మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లాల్సిందిగా సూచించారు. ఫిబ్రవరి 22న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీఎం మూడు రోజుల తర్వాత మరోమారు ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్న సీఎం పారికర్ గోవా ప్రజలను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. తన కోసం గత 15 రోజులుగా ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి దీవెనల వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్న ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం.. ప్రకటించిన కమలహాసన్!
రాహుల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరానన్న యువతి!
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
దుబాయ్‌ విమానానికి తప్పిన పెనుముప్పు 130 మంది ప్రయాణికుల గుండెల్లో గుభేల్‌
ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం
చిరుతతో 15 నిమిషాలు పోరాడి తల్లిని కాపాడుకున్న ధీర వనిత
ఉచిత ఆరోగ్య బీమా వచ్చేస్తోంది... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్
మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికాకు వెళ్లనున్న గోవా సీఎం
అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్
ప్రధాని మోదీని ‘శ్రీ’ అని సంబోధించని ఫలితం.. ఏడు రోజుల వేతనం కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1429273                      Contact Us || admin@rajadhanivartalu.com