తాజా వార్తలు కోడి పందాలపై పోలీసుల దాడులు.. భారీగా కోళ్లు, సొమ్ము స్వాధీనం         ఎన్నికలకు ముందు జగన్ ఘోర తప్పిదం: గంటా శ్రీనివాస్         తారీకు : 18-01-2019
 
అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్
ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతల ఆందోళన
ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ మెడలు వంచొచ్చన్న రాహుల్ గాంధీ
ఏపీ డిమాండ్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే చేసే మొట్టమొదటి పని అదేనని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తామందరం కలిసికట్టుగా ఉంటే ప్రధాని నరేంద్రమోదీని ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోగలమన్న విశ్వాసం ఉందని చెప్పారు.

తర్వాత రాహుల్ ట్వీట్ చేస్తూ.. ఈ (ఏపీకి ప్రత్యేక హోదా) విషయమై ప్రతిపక్షాలన్నీ ఒక్కటైతే ఏపీకి న్యాయం చేయాలని బీజేపీపై ఒత్తిడి తీసుకురాగలమన్న విశ్వాసం తనకు ఉందని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి మాట్లాడుతూ ప్రత్యేక హోదా డిమాండ్‌కు తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, ఏపీి డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పమన్నారని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లోను, బయట ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చేపట్టే ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని సోమ్‌నాథ్ భారతి స్పష్టం చేశారు.
ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం.. ప్రకటించిన కమలహాసన్!
రాహుల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరానన్న యువతి!
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
దుబాయ్‌ విమానానికి తప్పిన పెనుముప్పు 130 మంది ప్రయాణికుల గుండెల్లో గుభేల్‌
ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం
చిరుతతో 15 నిమిషాలు పోరాడి తల్లిని కాపాడుకున్న ధీర వనిత
ఉచిత ఆరోగ్య బీమా వచ్చేస్తోంది... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్
మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికాకు వెళ్లనున్న గోవా సీఎం
అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్
ప్రధాని మోదీని ‘శ్రీ’ అని సంబోధించని ఫలితం.. ఏడు రోజుల వేతనం కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1429248                      Contact Us || admin@rajadhanivartalu.com