తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
ఫేస్‌బుక్‌లో పోస్టు.. 42 రోజుల జైలు
యూపీలో యువకుడి అరెస్ట్‌
సోషల్‌మీడియాతో జర జాగ్రత్త
న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త..! పోస్టులు, కామెంట్లు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందికదా అని ఆన్‌లైన్‌లో హద్దులు దాటారో అంతే సంగతులు. నెట్టింట్లో చెలరేగిపోతే జైల్లోకి నెట్టేసే పరిస్థితి రావచ్చు. అందుకు నిదర్శనమే ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన. జకీర్‌ అలీ త్యాగి(18) ఫేస్‌బుక్‌లో గంగానది, రామ్‌ మందిర నిర్మాణం, ముస్లింలకు హాజ్‌సబ్సిడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడిని అరె్‌స్ట చేసి ఐపీసీ 420తో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 42 రోజుల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై ముజఫర్‌నగర్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే జకీర్‌ను అరెస్టు చేయడం.. తీవ్రనేరాలు చేసిన ఖైదీలతో పాటు ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకే నేరగాడిగా పరగణించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్‌ మీడియాలో అభ్యంతర పోస్టులపై కేసుల నమోదు గతంలోనూ జరిగింది. గతంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే మరణించినప్పుడు ముంబై నగరం స్తంభించింది.దీనిపై ఓ అమ్మాయి సోషల్‌ మీడియాలో వెటకారపు పోస్టు పెట్టింది. దానికి మరో అమ్మాయు లైక్‌ కొట్టింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగి కేసులు, అరె్‌స్టలు కూడా అయ్యాయి. ఆ మధ్య ఓ వ్యక్తి ప్రధాని మోదీ ఫొటోను స్నాప్‌చాట్‌లో మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేశాడు. దీంతో అత డు ఊచలు లెక్కపెట్టాడు. ఏపీలో శాసనమండలిపై అభ్యంతరకర ఫొటో షేర్‌ చేసినందుకు ఓ వ్యక్తిపై కేసుపెట్టారు. ఇక తాజాగా వరంగల్‌లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓ బస్‌ కండక్టర్‌ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టాడు. ఈ వ్యవహారం విచారణ దాకా వెళ్లింది. అందుకే డేటా ఉంది కదా అని ఆన్‌లైన్‌లో రెచ్చిపోకండి. కామెంట్లు పెట్టేముందు ఆలోచించండి.
చిరుతతో 15 నిమిషాలు పోరాడి తల్లిని కాపాడుకున్న ధీర వనిత
ఉచిత ఆరోగ్య బీమా వచ్చేస్తోంది... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్
మెరుగైన చికిత్స కోసం నేడు అమెరికాకు వెళ్లనున్న గోవా సీఎం
అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్
ప్రధాని మోదీని ‘శ్రీ’ అని సంబోధించని ఫలితం.. ఏడు రోజుల వేతనం కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను!
రాంగ్ రూట్ లో వచ్చి, హైదరాబాద్ లో ఫ్లైఓవర్ పై నుంచి కిందపడ్డ ఐటీ ఉద్యోగుల బస్సు
హెచ్‌1 బి వీసా: మరింత కఠినం
వాటర్ బాటిల్స్.. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే జైలుకే!
ఇవాంకా.. ఇంకొన్ని ఆసక్తికర సంగతులు..
అమ్మ లేకపోతే నాన్న జీరోనే
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com