తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
పామును చంకలో పెట్టుకొని రైలెక్కాడు
బోస్టన్‌: ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఎన్నో భయాందోళనకు గురయ్యే వీడియోలను మనం చూశాం. ముఖ్యంగా పాములకు సంబంధించినవయితే ఆశ్చర్యపోయే వీడియోలు లెక్కలేనన్ని. అయితే, వాటన్నింటిని తలదన్నేలా ఇప్పుడు ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఎందుకంటే ఈసారి ఆ వీడియోలో పాము కనపించింది ఏ విమానంలోనో, లేక కారు ఇంజిన్‌లోనో, ఎయిర్‌ కండిషనర్‌లోనో కాదు.. ఓ వ్యక్తి ఒడిలో. అవునూ.. ఇది నిజమే.. ఓ వ్యక్తి తన ఒడిలో ఏం చక్కా పామును పెట్టుకొని ట్రైన్‌లో కూర్చొగా అది కాస్త సగం బయటకు వచ్చి అటూఇటూ చూడటం మొదలుపెట్టింది.

ఆ దృశ్యాన్ని చూసిన ఓ మహిళ భయంతో ఎగిరిగంతేసినంత పనిచేసింది. ఈ సంఘటన మాస్సాచుస్సెట్స్‌లోని బోస్టన్‌లో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి కుక్క పిల్లుల మాదిరిగా పామును చంకలో పెట్టుకొని రైలు ఎక్కడం చూసి అప్పటి వరకు అతడి చుట్టు ఉన్నవాళ్లంతా కూడా భయంతో బెంబేలెత్తిపోయారు. అసలు రైలులో ఏం జరుగుతోంది? పాములతో ప్రయాణం ఏమిటీ.. అందుకు అసలు అనుమతి ఉందా? ఒక వేళ ఉన్నా ఆ పామును ప్రత్యేకంగా ఓ బాక్స్‌లో పెట్టి జాగ్రత్తగా తీసుకురావాలే తప్ప అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ వారంతామండిపడుతున్నారు.
ఏ క్షణమైనా అణు యుద్ధం: కొరియా
ఆ విషయాన్ని వాట్సాప్ ఎలా గుర్తిస్తుంది?
కత్తులతో వచ్చినోళ్లకు విశ్వరూపం
ఫేస్‌బుక్‌లో పోస్టు.. 42 రోజుల జైలు
ప్రవాస జంట పెద్ద మనసు
వాట్సాప్‌కు మరో ఎదురు దెబ్బ
యుద్ధంపై అమెరికా వైఖరిదే...
మరియా.. ఇక మహా ప్రళయమేనా?
ఈ నెల 21న తమిళనాడులో బలనిరూపణ.. ఈ సారి నెగ్గేది ఎవరంటే..!
మళ్లీ జూలు విదిల్చిన కిమ్‌
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146290                      Contact Us || admin@rajadhanivartalu.com