తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
ఏ క్షణమైనా అణు యుద్ధం: కొరియా
ఐక్యరాజ్యసమితి: అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణమైనా అణు యుద్ధం ముంచుకొస్తుందని ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియా డిప్యూటీ అంబాసిడర్‌ హెచ్చరించారు. తమ అణు, క్షిపణి కార్యకలాపాలు వ్యూహాత్మకంగా చేపడుతున్నవని, వీటిని నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అమెరికా నుంచి అణు ముప్పు పూర్తిగా తొలిగేవరకూ తాము అణ్వాయుధాలు, బాలిస్టిక్‌ రాకట్లను వీడబోమని స్పష్టం చేశారు.మరోవైపు కొరియా అణు సంపత్తిని, క్షిపణి ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్‌ సమర్థించుకున్నారు. 1970 నుంచి ప్రపంచంలో కేవలం ఉత్తర కొరియా మాత్రమే అమెరికా నుంచి నేరుగా అణు దాడులకు టార్గెట్‌గా ఉందని, ఆత్మరక్షణ కోసం తాము అణ్వాయుధాలను కలిగిఉండటం తమ హక్కని కిమ్‌ ఐరాస నిరాయుధీకరణ కమిటీకి స్పష్టం చేశారు.

అణు పరీక్షలు ఏటా తాము నిర్వహించే మిలటరీ ఎక్సర్‌సైజ్‌ల్లో భాగమేనని, అయితే తమ అగ్రనాయకత్వాన్ని తొలగించేందుకు అమెరికా నిర్వహించే సీక్రెట్‌ ఆపరేషనే అన్నింటికన్నా ప్రమాదకరమని కిమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం అమెరికా భూభాగం తమ ఫైరింగ్‌ రేంజ్‌లో ఉందని, తమ భూభాగంలో ఓ అంగుళంపైనా దండెత్తే దుస్సాహసానికి అమెరికా పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఏ క్షణమైనా అణు యుద్ధం: కొరియా
ఆ విషయాన్ని వాట్సాప్ ఎలా గుర్తిస్తుంది?
కత్తులతో వచ్చినోళ్లకు విశ్వరూపం
ఫేస్‌బుక్‌లో పోస్టు.. 42 రోజుల జైలు
ప్రవాస జంట పెద్ద మనసు
వాట్సాప్‌కు మరో ఎదురు దెబ్బ
యుద్ధంపై అమెరికా వైఖరిదే...
మరియా.. ఇక మహా ప్రళయమేనా?
ఈ నెల 21న తమిళనాడులో బలనిరూపణ.. ఈ సారి నెగ్గేది ఎవరంటే..!
మళ్లీ జూలు విదిల్చిన కిమ్‌
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146305                      Contact Us || admin@rajadhanivartalu.com