తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 10-08-2020
 
కోర్టే అతని కోసం కదిలింది.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా..?
సిన్సినాటి: అమెరికాలోని సిన్సినాటిలో ఒక్క వ్యక్తి కోసం ఏకంగా న్యాయస్థానమే కదిలింది. అతనేమీ అక్కడి మినిస్టరో, ఆ దేశ అధ్యక్షుడో కాదు. ఓ మామూలు డ్రగ్ డీలర్. అతని పేరు కిర్క్ లేనెల్ స్మిత్. అతనిపై నమోదైన కేసు విచారణలో పాల్గొనడానికి స్మిత్‌ను కోర్టులో హాజరుకావాల్సిందిగా జడ్జి ఆదేశించాడు. ఆ ఆదేశాలను పట్టించుకోని స్మిత్.. తాను కోర్టుకు రావడం కుదరదని తేల్చిచెప్పాడు. విషయం తెలిసిన న్యాయమూర్తి.. ఆగ్రహం చెందకుండా కోర్టునే స్మిత్ వద్దకు తీసుకొచ్చాడు. దీనంతటికీ కారణం స్మిత్ ఊబకాయమే. 42 ఏళ్ల స్మిత్ బరువు 272 కేజీలపైమాటే. దాంతో అతను అంబులెన్సులో నుంచి కనీసం కాలు కూడా కిందపెట్టలేని స్థితిలో ఉన్నాడు. అతని అంబులెన్సులో కొలువైన న్యాయస్థానంలోనే అతనిపై విచారణ జరిగింది. విచారణ అనంతరం అతను చెప్పుకునేది ఏమైనా ఉందా అని జడ్జి ప్రశ్నించాడు. మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్న స్మిత్ ఆ ప్రశ్నకు కనీసం సమాధానం కూడా ఇవ్వలేకపోయాడు. దీంతో విచారణ ముగించిన న్యాయమూర్తి.. స్మిత్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించాడు.
విజయవంతంగా ఆటా పాటల పోటీలు
విజయవంతంగా ఆటా పాటల పోటీలు
తానా ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక మహోత్సవం
ఆట ‘ఝమ్మంది నాదం’ ఫైనలిస్ట్‌లు వీరే!
ఆస్ట్రేలియాలో తెలుగుకు పట్టం
సింగపూర్​లో బోనాల ఉత్సవాలు
ఆర్యవైశ్య సభ సింగపూర్ విభాగానికి నూతన కార్యవర్గం
‘సంపద’పెంచుకున్న ప్రవాసాంధ్రులు
లండన్​లో బోనాలు ప్రారంభం
సింగపూర్​లో వైభవంగా సాహిత్య సమ్మేళన వేడుకలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614677                      Contact Us || admin@rajadhanivartalu.com