తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు
షాంబర్గ్:
అమెరికా తెలుగు సంబరాలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఘనంగా నిర్వహించింది. చికాగోలోని షాంబర్గ్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేశారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగువారిని ఉత్తేజ పరిచేలా ఈ సంబరాలు జరిగాయి.

రుద్ర శంకరం, అన్నమాచార్య కీర్తనలు, సౌండ్ ఆఫ్ ఇషా, వెంకటాచల నిలయం, బాల రామయణం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ వచ్చి వారిని భక్త ప్రవాహంలో ఓలలాడించాయి. సంబరాల వేదికపై బతుకమ్మ ఆడి ఏ దేశమేగినా జన్మభూమిని మరువమంటూ ప్రవాసులు చాటారు. కూచిపూడి, కథక్ లాంటి సంప్రదాయ నృత్యాలు కూడా ప్రవాసుల్లో భారతీయ కళల పట్ల ఉన్న మక్కువ ఏ పాటిదో చూపించాయి. అమెరికాలో ఏడేళ్ల తెలుగు బాలుడు ఆకాశ్ ఊకోటి తో స్పెల్ బీ పై నిర్వహించిన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. కచ్చపి కళాపీఠం వారు 'భువన విజయం' పద్య నాటకం ప్రదర్శించారు. తటవర్తి కల్యాణ చక్రవర్తి రాసిన ఆధునిక చిత్రణతో కూడిన ఈ 'భువనవిజయం', భూమినే నమ్ముకున్న రైతు, తల్లి, మనవడి మధ్య సంఘర్షణపై 'మనలోని మనిషి' నాటికలు అందరిని అకట్టుకున్నాయి.

ఇక తెలుగు సినీ తారల సందడి కూడా అమెరికాలో తెలుగువారికి మధురానుభూతులను పంచాయి. నటులు అల్లు అర్జున్, నిఖిల్, సాయికుమార్, అలీ, సుబ్బరాజు, పూజ హెగ్డేలతో పాటూ బుల్లి తెర నటీ నటులు సంబరాల్లో సందడి చేశారు. రేవంత్ మ్యూజికల్ నైట్ తెలుగువారిలో ఫుల్ జోష్ నింపింది. గాయనీ సునీత, వందేమాతరం శ్రీనివాస్ లు పాడిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.ప్రముఖులు, మానవతా వాదులకు సత్కారాలు:
అనేక రంగాల్లో రాణిస్తూ తెలుగుజాతికి ఆణిముత్యాలనే పేరు తెచ్చుకుంటున్న వారిని నాట్స్ సన్మానించింది. ప్రముఖ రచయిత, రాజ్య సభ సభ్యుడు, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్తో పాటు మధ్య ప్రదేశ్లోని, ఇండోర్ కలెక్టర్గా పనిచేస్తూ రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్న పరికిపండ్ల నరహరిని నాట్స్ సన్మానించింది. మానవతా వాది సేవాతత్పరుడు సుధాకర్ కొర్రపాటి, కమ్యూనిటీ సేవలకు గుర్తింపుగా దాము గేదెల, ఆర్‌ఎక్స్‌ అడ్వాన్స్ కార్య నిర్వహణ అధికారి, వ్యవస్థాపకులు రవి ఐకలను నాట్స్ సన్మానించింది.తెలుగు కవులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, స్పెల్ బీ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఎనిమిదేళ్ల తెలుగు బాలుడు ఆకాశ్ ఊకోటిని ధారణ వామనుడుగా అభివర్ణించారు. ఇదే వేదికపై జొన్నవిత్తుల ప్రతిపాదించగా నాట్స్ ఆకాశ్ ఊకోటికి 'ధారణ వామన' బిరుదును పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిబొట్ల ఆనంద్, మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా వేలాదిగా తెలుగు వారు ఈ నాట్స్ సంబరాల్లో పాల్గొన్నారు. నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి, నాట్స్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట, సంబరాల వాలంటీర్లను అభినందించారు. ఈ మూడు రోజుల తెలుగు సంబరాల్లో బావర్చి యాజమాన్యం భోజన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, బావర్చి అధినేత కిషోర్ కంచర్లను నాట్స్ సన్మానించింది.

తదుపరి నాట్స్ సంబరాలు 2019లో సియాటెల్లోనూ, 2021 సంబరాలు న్యూ జెర్సీలోనూ జరగనున్నాయని నాట్స్ చైర్మన్ సామ్ మద్దాళి ప్రకటించారు. రేవంత్, సునీత, వందేమాతరం శ్రీనివాస్, సాయికుమార్ తదితరులు గానం చేసిన 'పుణ్య భూమి నా దేశం నమో నమామి' పాటతో, అనంతరం రావు ఆచంట వందన సమర్పణ తో సంబరాలు ముగిశాయి.
అధికార దాహార్తుల చేతిలో బందీగా వర్జీనియా శ్రీవేంకటేశ్వర లోటస్ ఆలయం
సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సిడ్నీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
యూకేలో ఘనంగా 'జయతే కూచిపూడి 2017'
సింగపూర్‌లో అలసాని క్రిష్ణారెడ్డికి సత్కారం
టీడీఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వన భోజనాలు
ఆవిరైన ‘దుబాయి’ ఆనందం
సిడ్నీలో ఘనంగా వినాయక చవితి సంబరాలు..
టీడీఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వన భోజనాలు
బోనమెత్తిన సింగపూర్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275493                      Contact Us || admin@rajadhanivartalu.com