తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
అధికార దాహార్తుల చేతిలో బందీగా వర్జీనియా శ్రీవేంకటేశ్వర లోటస్ ఆలయం
అమెరికాలోని పలు నగరాల్లో హిందూ దేవాలయాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. ఈ ఆలయాలు అన్నీ లాభాపేక్ష లేని ధార్మిక సంస్థలు. తమ కష్టార్జితాన్ని భక్తులు ఎంతో శ్రద్ధగా దైవాలకు సమర్పించి ఆలయ నిర్వహణకు తోడ్పడుతున్నారు. ఈ ఆలయాల నిర్వహణా బాధ్యతలు పర్యవేక్షించే కార్యవర్గ సభ్యుల చిత్తశుద్ధిని భక్తులు విశ్వసిస్తారు. కానీ కొన్ని ఆలయాల్లో సంస్థ రాజ్యాంగం పట్ల కార్యవర్గ సభ్యులు తమ నిజాయితీని నిలబెట్టుకోలేకపోతున్నారు. వర్జీనియా రాష్ట్రంలోని ఫెయిర్‌ఫ్యాక్స్ నగరంలో గల శ్రీ వేంకటేశ్వర లోటస్ ఆలయ మొదటి విడత నిర్మాణ పనులు ఏడాదిన్నర క్రితం పూర్తి చేశారు. చినజీయర్ స్వామిజీ ఆలోచనా పుత్రికే ఈ ఆలయం. ఆహారం రవి, ఆయన సతీమణి ఆహారం వాసంతి ఆలయాన్ని నడిపిస్తున్న తీరు నచ్చని స్వామిజీ సంస్థ ఈ ఆలయ వ్యవహారాల నుండి తప్పుకుంది. ఇది జరిగిన అనంతరం ఆహారం దంపతులు ఇరువురుపై సరైన పర్యవేక్షణ కొరవడింది. ఆలయాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తూ, జవాబుదారీతనానికి నీళ్లు వదిలారు. వెంకన్న భక్తుల అందరి విరాళాలతో రూపొందించిన మొదటి విడత నిర్మాణాలు కలిగిన ఈ ఆలయాన్ని "ఆహారం ఆలయం"గా గుర్తించాలని వీరిరువురూ కృషి చేశారు. గత రెండేళ్లుగా ట్రస్టు బోర్డు సభ్యుల్లో కొందరు ఆలయ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటించాలని, నిధుల ప్రవాహానికి సరైన ఆడిటింగ్ నిర్వహించాలని ఆహారం దంపతులకు విన్నవిస్తూ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ ట్రస్టీలుగా ఉండటం సబబు కాదని తెలిపినా కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వకుండా ఆహారం దంపతులు అంతర్గతంగా తమకు అనుకూలంగా వ్యవహరించే ట్రస్టు బోర్డు సభ్యులను మెజారిటీ బృందంగా ఏర్పరుచుకుని ఆలయ అక్రమాలకు నియంతృత్వ పోకడలో తెరలేపారు. 2014, 2015, 2016 ఏళ్లకు గానూ 8మిలియన్ డాలర్లు ఖర్చుతో ఆలయ నిర్మాణం జరిగింది. మెజార్టీ సభ్యుల అండతో ఈ సంవత్సరాల్లో నిర్వహించిన ఖర్చుల తనిఖీకి సైతం ఆహారం దంపతులు మరియు వారి అనుచరులు సహకరించలేదు. ఈ చర్యలకు విసుగెత్తి మొత్తం 15మంది సభ్యులు కలిగిన ట్రస్టు బొర్డు నుండి ఇరువురు సభ్యులు రాజీనామా చేశారు. ఆలయ పద్దుల తనిఖీకి అడ్డుపడుతున్నందుకు గానూ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినందుకు గానూ ట్రస్టు బోర్డు సభ్యుడైన వారణాసి గోపాల్ ఫెయిర్‌ఫ్యాక్స్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో చైర్మన్ ఆహారం రవి, వారి మెజార్టీ అనుచర సభ్యులు ఆహారం వాసంతి, వెంకట్ బసవరాజు, సెల్వ జయరామన్, వెంకట కోసూరి, సంపత్ కృష్ణన్, బాలాజీ రామానుజం, మేళ్లచెరువు వెంకటరమణలపై దావా వేశారు. ఆలయానికి తాను 6లక్షల డాలర్లు అప్పుగా ఇచ్చామని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న ఆహారం దంపతుల నుండి సరైన ఆధారాలను సమర్పించవలసిందిగా గోపాల్ అడిగారు. దావా వేయడానికి పూర్వం గోపాల్ వారణాసి తన సొంత ఖర్చులతో ఆహారం బృందం సమర్పించిన దస్తావేజులన్నింటికీ ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిధుల ప్రవాహంలో పారదర్శక లోపాలు ఉన్నయని తేలింది. రాజ్యాంగ విరుద్ధంగా తమ పదవీకాలానికి ఉన్న పరిమితులను సైతం ఉల్లంఘించారని గోపాల్ ఆరోపించారు. చైర్మన్ నేతృత్వంలో మెజార్టీ సభ్యుల అక్రమాల వలన ఆలయ రాజ్యాంగానికి విలువ లేకుండా పోయిందని, అమెరికా ఆదాయ పన్ను శాఖ నిబంధనలు కాలరాశారని, ఇది ఆలయ ప్రతిష్ఠకు మచ్చ తీసుకురావడంతో పాటు సంస్థ మూలాలను సైతం దారుణంగా ప్రభావితం చేస్తుందని గోపాల్ తన దావాలో ఆవేదన వెలిబుచ్చారు. చైర్మన్ పదవీకాలం ఒక ఏడాది మాత్రమేనని ఆలయ రాజ్యాంగం ఘోషిస్తున్నా, ఆహారం రవి గత తొమ్మిదేళ్లుగా ఆ పీఠంపై ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారని, బోర్డు కనుసన్నల నుండి తప్పించి అన్ని కార్యకలాపాలను తన వ్యక్తిగత పరిధిలోకి తీసుకుని వెళ్లారని గోపాల్ పేర్కొన్నారు. దావాలో 2014-16 కాలానికి పద్దుల తనిఖీ వైఫల్యం పూర్తిగా చైర్మన్ బాధ్యతారాహిత్యమేనని ఆరోపించారు. ఈ కాలంలోనే 8మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. చైర్మన్ తాను లోనుగా ఇచ్చినట్లు పేర్కొంటున్న 6లక్షల డాలర్లకు ధృవీకరణ పత్రాలు సమర్పించలేదని పేర్కొన్నారు. భక్తులకు ఓ అద్భుత ధార్మిక క్షేత్రాన్ని అందించాలనే లక్ష్యంతో వారణాసి గోపాల్ తన సొంత నిధులను ఖర్చు చేసి ఈ దావా ద్వారా 8మంది సభ్యులు కలిగిన మెజార్టీ ట్రస్టు బోర్డుపై న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. గోపాల్ వారణాసితో పాటు ఆహారం దంపతులతో ఏకీభవించని మిగిలిన ట్రస్టు బోర్డు సభ్యులు సైతం ఆలయ కార్యక్రమాలు మరియు పరిపాలనా బాధ్యతలు భక్తులు, స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా జరిపించాలని ఆకాంక్షిస్తున్నారు. మెజార్టీ సభ్యులు కలిగిన ఆహారం రవి ఆధ్వర్యంలోని కార్యవర్గం జనవరి 21న సమావేశమై గోపాల్ వారణాసి తమపై వేసిన దావాను ఎదుర్కొనేందుకు ఆలయ నిధులను వినియోగించుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టి తమ మెజార్టీతో ఆమోదముద్రను సైతం వేసేసుకున్నారు. ఇదే సమావేశంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించి, పదవులను తమలో తామే తిరిగి పంచుకున్నారు. ఆలయం పట్ల బాధ్యత కలిగిన పలువురు ప్రవాస ప్రముఖులు ఆహారం కుటుంబ పాలనలో సాగుతున్న నిరంకుశ ధోరణుల పట్ల తమ ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. న్యాయపోరాటం ద్వారా ఆలయ వ్యవహారాల్లో గుణాత్మక పరివర్తన సిద్ధించాలని, తద్వారా భక్తుల్లో ఆలయం పట్ల విశ్వాసాన్ని పెంచాలని ఆలయ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
అధికార దాహార్తుల చేతిలో బందీగా వర్జీనియా శ్రీవేంకటేశ్వర లోటస్ ఆలయం
సింగపూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సిడ్నీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
యూకేలో ఘనంగా 'జయతే కూచిపూడి 2017'
సింగపూర్‌లో అలసాని క్రిష్ణారెడ్డికి సత్కారం
టీడీఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వన భోజనాలు
ఆవిరైన ‘దుబాయి’ ఆనందం
సిడ్నీలో ఘనంగా వినాయక చవితి సంబరాలు..
టీడీఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వన భోజనాలు
బోనమెత్తిన సింగపూర్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com