తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
వేరు మాట... ఒకే బాట!
తలాక్‌పై ఐదుగురు జడ్జిలదీ ఒకే అభిప్రాయం
మత స్వేచ్ఛ, సమానత్వంపై భిన్న వైఖరులు
‘మెజారిటీ, మైనారిటీ’ మధ్య తేడాలు ఇవే!
న్యూఢిల్లీ : ఐదుగురు న్యాయమూర్తులు! అందరిదీ ఒకే మాట! ‘ట్రిపుల్‌ తలాక్‌ వద్దే వద్దు’ అన్నదే తీర్పు! అయితే... ముగ్గురు జడ్జిలు ‘ఒకేసారి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. ఇది చెల్లదుకాక చెల్లదు’ అని తెలిపారు. ఇద్దరేమో... ‘ట్రిపుల్‌ తలాక్‌ మహిళలపై వివక్షా పూరితం. దీనిని చట్టంద్వారా సరిచేయాలి. కేంద్రం ఆరునెలల్లో చట్టం రూపొందించాలి. అప్పటిదాకా ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదు’ అని చెప్పారు. మొత్తానికి ముగ్గురు జడ్జిలు ఇచ్చిన మెజారిటీ తీర్పే చెల్లుబాటయ్యింది. కానీ... ఐదుగురి మధ్య భిన్నాభిప్రాయాలు ఎక్కడ, ఏయే విషయాల్లో వచ్చాయో ఒక్కసారి చూద్దాం!

ఆర్టికల్‌ 25పై తలోమాట
‘‘ట్రిపుల్‌ తలాక్‌ ఇస్లాంలో అంతర్భాగం. ఇది మత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఆర్టికల్‌ 25వ ప్రకారం ఇది రాజ్యాంగమే కల్పించిన హక్కు. అందులో జోక్యం చేసుకోలేం’’ అన్నది మైనారిటీ తీర్పు చెప్పిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌, జస్టిస్‌ నజీర్‌ల అభిప్రాయం. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధం కాదని కూడా వీరు తేల్చారు. కానీ... మెజారిటీ తీర్పు ఇచ్చిన ముగ్గురు జడ్జిలు ఈ అభిప్రాయంతో విభేదించారు. దీనికి సంబంధించి ఖురాన్‌లో ఉన్న నియమ నిబంధనలన్నీ తీర్పులో ఉల్లేఖించారు. ‘‘ట్రిపుల్‌ తలాక్‌ను దేవుడే అంగీకరించడంలేదు. ఇది ఖురాన్‌కు విరుద్ధం. ఇస్లాం అన్నది ఎట్టిపరిస్థితుల్లో ఖురాన్‌కు వ్యతిరేకంగా ఉండొద్దు. అందుకే... ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు కూడా ట్రిపుల్‌ తలాక్‌ విరుద్ధమే’’ అని ముగ్గురు జడ్జిలు స్పష్టం చేశారు.

ఆర్టికల్‌ 14 లెక్క ఇదీ...
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 సమానత్వ హక్కును ప్రసాదిస్తోంది. మైనారిటీ తీర్పు ఇచ్చిన ఇద్దరు జడ్జిలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ‘మతసంబంధ విషయం కాబట్టి... కేంద్రమే చట్టం చేయాలి’ అనే వైఖరికి కట్టుబట్టారు. అయితే... మెజారిటీ తీర్పు చెప్పిన న్యాయమూర్తులు దీనితో విభేదించారు. ‘‘ట్రిపుల్‌ తలాక్‌లో పురుషుడిదే ఇష్టారాజ్యం. రాజీకి, మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదు. ఇది మహిళలకున్న సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోంది’’ అని స్పష్టం చేశారు.

విశేషాధికారం ఇలా...
నిజానికి... చట్టాలకు భాష్యం చెప్పడమే సుప్రీంకోర్టు బాధ్యత. అంతేతప్ప... ఫలానా అంశంపై చట్టం చేయాలని చెప్పకూడదు. కానీ... ట్రిపుల్‌ తలాక్‌ సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, దీనిని నిషేధిస్తూ చట్టం చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు... రాజ్యాంగం విశేష అధికారాలను ఉపయోగించింది.
తలాక్‌ ఎఫెక్ట్‌...
దేశంలో విడాకులు తీసుకున్న మహిళలు 9.09 లక్షల మంది. వీరిలో 23 శాతం ముస్లింలే. అంటే... విడాకుల బాధితుల్లో ముస్లింలే ఎక్కువన్న మాట. ‘ట్రిపుల్‌ తలాక్‌’ ప్రభావాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. విడాకులు తీసుకున్న మహిళల్లో 68 శాతం మంది హిందువులు, 4 శాతం క్రైస్తవులు, 1.5 శాతం మంది సిక్కులు ఉన్నారు.

‘ఫిక్కీ లేడీస్‌’ హర్షం
తలాక్‌పై సుప్రీం తీర్పును ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) స్వాగతించింది. తాము మహిళా సాధికారతకు అండగా ఉంటామని ప్రకటించింది. ‘‘నిరంకుశంగా, ఏకపక్షంగా సాగే ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతి... ముస్లిం మహిళల ప్రగతికి అడ్డంకిగా నిలిచింది’’ అని ఎఫ్‌ఎల్‌వో అధ్యక్షురాలు వాసవి భరత్‌ రామ్‌ పేర్కొన్నారు.

మరో రెండు పద్ధతులున్నాయి!
‘‘ఒకేసారి ముమ్మార్లు తలాక్‌ చెప్పడం చెల్లదని సుప్రీం తీర్పు స్పష్టంగా చెప్పింది. అయితే... తలాక్‌లోని మరో రెండు పద్ధతులు కూడా మహిళలపై వివక్ష చూపించేవే. లింగ సమానత్వానికి ఇవి సవాల్‌ విసురుతూనే ఉంటాయి’’
- చిదంబరం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
వేరు మాట... ఒకే బాట!
రాజధానిని ఖాళీ చేయిస్తున్న చైనా!
త్వరలో రూ.200 నోట్లు
సురేశ్‌ ప్రభు రాజీనామా!
‘కిమ్‌’ కర్తవ్యం..?
మంటల ప్రపంచ పటం
అభివృద్ధి కోసం బాపూజీ స్ఫూర్తితో మహోద్యమం: మోదీ
బాలికలకు 40% సీట్లు:నఖ్వీ
రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె!
పన్నీర్‌సెల్వం పదవిపై క్లారిటీ వచ్చేసింది..!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113364                      Contact Us || admin@rajadhanivartalu.com