తాజా వార్తలు మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్         అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!         తారీకు : 28-09-2020
 
ఆంధ్రప్రదేశ్ వార్తలు
మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్
ఈ నెలాఖరుతో మద్యం పాలసీ ముగుస్తున్నందున ప్రస్తుతమున్న 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సు రెన్యువల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మద్యపానంతో కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శుక్రవారం జీవో జారీ చేశారు.
Read More
------------------------------------------
అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!
చిత్తూరు: కుటుంబ కలహాలతో బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఊటబావులపల్లెలో చోటుచేసుంది. స్థానికుల కథనం.. ఊటబావులపల్లెకు చెందిన సురేష్‌(32), కృష్ణవేణి(24) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు వరుణ్‌తేజ్‌(6), హర్షిత(3) ఉన్నారు. కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు పరిపాటి అయ్యాయి. దీంతో శుక్రవారం సాయంత్రం మనస్తాపం చెందిన కృష్ణవేణి ఇద్దరి పిల్లలను వెంటతీసుకుని గ్రామానికి అరకిలోమీటరు దూరంలోని దేవళంగుట్టపైకి వెళ్లింది. ఇద్దరి పిల్లలను చీరకొంగుకు చుట్టుకుని కోనేటిలో దూకేందుకు యత్నించింది.
Read More
------------------------------------------
ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్‌ కుమార్‌
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు.
Read More
------------------------------------------
కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్న టీడీపీ
అమరావతిలో రాజధాని పేరుతో జరిగిన భారీ భూ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read More
------------------------------------------
   వ్యాపార రంగం
ఒరిజినల్‌ రూ.45 వేలు.. నకిలీ రూ.39.85 కోట్లు
విజ‌య‌వాడ‌లో కొత్త‌గా 10 కంటైన్‌మెంట్ జోన్లు
ఐఐటీ, ఎన్‌ఐటీ అభ్యర్థులకు ఊరట
దర్మంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు
కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌
గైర్హాజరైతే వెంటనే తొలగింపు
నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలి: మధు

   అంతర్జాతీయ వార్తలు
యూఎన్‌ సర్వసభ్య సమావేశంలో చేదు అనుభవం
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భంగపాటు ఎదురయ్యింది. పాక్‌ ప్రధాని ఉపన్యాసం ప్రారంభం అయిన వెంటనే భారత ప్రతినిధి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ హాల్‌ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇమ్రాన్‌ ఖాన్‌ శుక్రవారం నాటి సర్వసభ్య సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక కశ్మీర్‌ సమస్యను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిజిటో వినిటో వాకౌట్‌ చేశారు. అనంతరం పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టీఎస్‌ తిరుమూర్తి స్పందించారు.
నీటిలోని టాక్సిన్స్ వ‌ల్లే ఏనుగులు మృతి
నీటిలోని సైనోబాక్టీరియా ఉత్పత్తి చేసే టాక్సిన్స్ వ‌ల్ల ఈ ఏడాది దాదాపు 300 ఏనుగులు చ‌నిపోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. వ‌రుస‌గా ఏనుగులు చ‌నిపోతుండ‌టంపై విచ‌ర‌ణ చేప‌ట్టిన ద‌ర్యాప్తు సంస్థ ఈ మేర‌కు షాకింగ్ విష‌యాలను వెల్ల‌డించింది. సాధార‌ణంగా సైనోబాక్టీరియా అనేది నీటిలో, మ‌ట్టిలోనూ ఉండే సూక్ష‌జీవి. వీటి వ‌ల్ల ప్ర‌మాదం లేక‌పోయినా వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల విష‌తుల్యం అయ్యాయ‌ని అధికారులు పేర్కొన్నారు.
ట్రంప్‌ వైపు ఇండియన్‌ అమెరికన్లు మొగ్గు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్‌ అమెరికన్లు డొనాల్డ్‌ ట్రంప్‌ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ప్రధానంగా స్వింగ్‌ స్టేట్స్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ట్రంప్‌కి, ప్రధాని మోదీకి మధ్యనున్న స్నేహ బంధం వల్లే ప్రవాస భారతీయులు ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఆ సర్వే పేర్కొంది. ట్రంప్‌ విక్టరీ ఇండియన్‌ అమెరికన్‌ ఫైనాన్స్‌ కమిటీ నిర్వాహకుడు అల్‌ మసన్‌ ఈ సర్వే నిర్వహించారు.
ఊహించని ట్విస్ట్‌ మైండ్‌బ్లాక్‌ అవడం‌ ఖాయం
ఒక్క క్షణం తర్వాత ఏం జరగబోతుందనేది ఎవరైనా ఊహించగలరా.. సరదాగా ఒక పామును ఆటపట్టిద్దామనుకున్న వ్యక్తి​కి ఊహించని పరిణామం ఎదురైతే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు గాని.. వీడియో చివర్లో మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.
  
సినిమా వార్తలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1632354                 About us   ||   Contact Us : admin@rajadhanivartalu.com