ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఇష్టారాజ్యం!
|
నచ్చిన వారికి కొలువులివ్వడం.. వారు అడిగినంత వేతనాలు చెల్లించడం దుర్గగుడి అధికారులకు పరిపాటిగా మారింది. కమిషనర్ ఆర్డర్‌తో పని లేదు.. ఆలయంలో ఉద్యోగం చేసే అర్హతలున్నాయా లేదా అనేది అవసరం లేదు.. కావాల్సిందల్లా అధికారుల అండదండలే.. గత కొంత కాలంగా దుర్గగుడిలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఈ విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించారు.
|
Read More
|
------------------------------------------ |
పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు.
|
పోలవరం ప్రాజెక్ట్‌ను,రాజధాని పేరు చెప్పి అమరావతిని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏనాడూ రైతుల గురించి ఆలోచించని చంద్రబాబుకు ఇప్పుడు అకస్మాత్తుగా రైతులు గుర్తుకు రావటం విడ్డూరమన్నారు. ప్రజలు ఎందుకు ఓడించారో ఆలోచించడానికి చంద్రబాబుకు 20 నెలలు పట్టిందని ఎద్దేవా చేశారు.రైతు రుణమాఫీ,డ్వాక్రా రుణమాఫీ అంటూ ఐదేళ్లపాటు ప్రజల్ని మోసగించారని,చంద్రబాబు ఇచ్చిన 650 బూటకపు హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
|
Read More
|
------------------------------------------ |
విద్వేషకారులపై కఠిన చర్యలు.
|
దేవాలయాలపై సామాజిక, ప్రచార మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సిట్ చీఫ్ జీవీజీ అశోక్‌కుమార్, డీఐజీలు రాజశేఖర్‌బాబు, పాల్‌రాజులతో కలిసి సవాంగ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ దు్రష్పచారం జరుగుతోందన్నారు. ఎప్పుడో జరిగిన ఘటనలు ప్రస్తుతం జరిగినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ సమాజంలో ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయతి్నస్తున్నారని చెప్పారు.
|
Read More
|
------------------------------------------ |
విశాఖలో భారీ స్టీల్ క్లస్టర్
|
తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే విధంగా విశాఖలో భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకోసం విశాఖ సమీపంలో పూడిమడక వద్ద సుమారు వెయ్యి ఎకరాల్లో స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
|
Read More
|
------------------------------------------ |
వ్యాపార రంగం
|
|
అంతర్జాతీయ వార్తలు
హెచ్ 1బీ వీసా లాటరీ విధానానికి చెల్లు చీటీ.
|
హెచ్1 బీ వీసా ఎంపికకు ఇప్పటివరకు వాడుతున్న లాటరీ విధానాన్ని తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.అధిక వేతనాలు,అత్యున్నత నైపుణ్యాల ఆధారంగా ఇక హెచ్ 1 బీ వీసాలను జారీ చేయనున్నట్లు మంగళవారం అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ (డీఓఎల్) ప్రకటించింది.తాజా మార్పులతో హెచ్ 1 బీ వీసాతో,ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్‌తో యూఎస్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.విదేశాల నుంచి చవకగా లభించే ఉద్యోగుల వల్ల అమెరికన్ ఉద్యోగులు ఎదుర్కొనే ముప్పును తొలగించే లక్ష్యంతో ఈ మార్పులు చేశారు.తాజా నిబంధనలు ఈ సంవత్సరం మార్చి 9 నుంచి అమల్లోకి రానున్నాయి.
|
అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్.
|
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు.క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు.
|
ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్ ఓకే
|
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బ్రిటన్ అనుమతిచ్చింది. బయోటెక్ ల్యాబ్స్ ఫైజర్ టీకా తరువాత యూకె.. ఓకే చెప్పిన రెండో కరోనా టీకాగా ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ మరో వారం రోజుల్లో బ్రిటన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
|
బ్రెగ్జిట్ డీల్‌కు యూకే ఆమోదం
|
యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న బ్రెగ్జిట్ వాణిజ్య ఒప్పందానికి బ్రిటిష్ ఎంపీలు బుధవారం ఆమోదం తెలిపారు. అనంతరం వాణిజ్య ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన డీల్ ఓటింగ్‌లో 521 మంది ఎంపీలు అనుకూలంగా, 73 మంది వ్యతిరేకంగా ఓట్ వేశారు.
|
|
|
|
|
సినిమా వార్తలు
|