తాజా వార్తలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్         ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం         తారీకు : 16-10-2019
 
సినిమా వార్తలు
  సినిమా ట్రైలరు
  లఘు సినిమాలు
  పూర్తి సినిమాలు
  సినిమా పాటలు
  విచిత్ర చిత్రాలు
 
ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నా: చిరంజీవి
కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ, వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ ‘కళాబంధు’గా కీర్తించబడుతున్నారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘‘గత పదిహేను రోజుల నుంచి ‘సైరా’ విజయం గురించే మాట్లాడుతున్నా. ఈ వేదికపై చెప్పాల్సింది దాని గురించి కాదు. ఎక్కడ మంచి జరిగినా.. పది మంది సంతోషంగా ఉన్నా.. అందులో తానూ భాగం అవుతూ పదిమందికీ సంతోషాన్ని పంచే వ్యక్తి సుబ్బరామిరెడ్డి. ఆయనను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయనకు కళాబంధు అని ఎవరు పెట్టారో తెలీదు కానీ, ఆయన మనసు నిజంగా అద్భుతం. ‘సైరా’ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన నాతో ఆనందం పంచుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీస్తున్నామని తెలిసినప్పటి నుంచి ఆయన ఎంతో శ్రద్ధ చూపించారు. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకునేవారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమాగా చెప్పేవారు. ఈ సినిమా హిట్ అయితే ఆయనే నిర్మాతగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయినంత ఆనందాన్ని మాతో పంచుకోవడం, మమ్మల్ని అభినందించడం సంతోషంగా ఉంది. ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆయన ప్రేమ, అభిమానంతో నా గుండె నిండిపోయింది. ‘సైరా’ను నా జీవితంలో గుర్తుండిపోయే సినిమాగా తెరకెక్కించిన సురేందర్‌రెడ్డికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే. బుర్రా సాయిమాధవ్ నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు చాలా థ్యాంక్స్. ఇంత గౌరవప్రదమైన సినిమాను నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన రామ్ చరణ్ నా నిర్మాతలందరిలోనూ నెంబర్ వన్ ప్రొడ్యూసర్. నేటి తరం హీరోయిన్లకు తమన్నా ఆదర్శం. ఆమె డెడికేషన్ మాటల్లో చెప్పలేనిది..’’ అన్నారు.
కొత్త సినిమాలు
ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నా: చిరంజీవి
న‌టిగా చాలా సంతోషంగా ఉంది: పాయల్
శేఖర్ కమ్ముల మూవీ ఈ ఏడాదిలో రానట్టేనట!
భయపెట్టే వసంతకాలం
తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను రాబట్టిన 'సైరా'
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
తోటి ఆర్టిస్ట్ ను కాపాడేందుకు ముందుకు దూకిన అక్షయ్ కుమార్... వీడియో ఇదిగో!
హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్‌..!
యావరేజ్ మూవీగానే నిలిచిన 'నానీస్ గ్యాంగ్ లీడర్'
కొత్తవాళ్లతో నేను తొందరగా కలవలేను: హీరో గోపీచంద్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1544846                      Contact Us || admin@rajadhanivartalu.com