తాజా వార్తలు డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి         విశాఖ మన్యంలో హైఅలర్ట్         తారీకు : 22-09-2020
 
ఆంధ్రప్రదేశ్ వార్తలు
డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారి పట్ల అపారమైన భక్తి కలిగి ఉన్నారు. ఆనాడు పాదయాత్ర ప్రారంభం ముందు,ముగిసిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. పీఠాధిపతులు అందరూ ఆశీర్వదించారు.
Read More
------------------------------------------
విశాఖ మన్యంలో హైఅలర్ట్
మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే క్రమంలో దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో యాక్షన్‌ టీమ్‌లు కూడా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మన్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీంతో అరకు, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల్లో ప్రతి ఇంటిని సోదా చేశారు.
Read More
------------------------------------------
'కాకి లెక్కల బాబు.. చొక్కాలు మార్చేస్తున్నారు'
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ట్విటర్‌ వేదికగా విమర్శించారు. 'చంద్రబాబు గతాన్ని ఒక్కసారి చూడండి. యునైటెడ్‌ ఫ్రంట్‌ ఉండగా సెక్యులర్‌ చొక్కా వేసుకున్నారు. పరాజయం తప్పదని తెలిసి స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉండి కూడా వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయేవైపు పరుగెత్తారు
Read More
------------------------------------------
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్‌ కుమార్‌.
ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌, లావు కృష్ణ దేవరాయలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను సోమవారం కలిశారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని చెప్పారు.
Read More
------------------------------------------
   వ్యాపార రంగం
గైర్హాజరైతే వెంటనే తొలగింపు
నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలి: మధు
బాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు: ఎమ్మెల్యే
త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం
రూ. 23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయండి
రోజురోజుకూ పెరుగుతున్న రికవరీ
పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దా?

   అంతర్జాతీయ వార్తలు
కోవిడ్‌ శాంపిల్‌ కోసం రోబో
గొంతులో నుంచి ఉమ్మిని సేకరించే రోబోను సింగపూర్‌ కు చెందిన మూడు సంస్థల నిపుణులు తయారు చేశారు. ఈ రోబో ముక్కులో నుంచి గొంతులోపల 10 సెంటీమీటర్ల లోతు నుంచి శాంపిల్‌ను సేకరిస్తుంది.
ఆమెకు అప్ఘనిస్తాన్‌ తల వంచింది
సెప్టెంబర్‌ – 17 గురువారం అప్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని అక్కడి ‘జనాభా నమోదు చట్టాన్ని’ సవరిస్తూ ఒక చరిత్రాత్మక సంతకం చేశారు. ఈ ఒక్క సంతకంతో అప్ఘనిస్తాన్‌లో ఇకపై ఆడవాళ్ల పేర్లు వినపడనున్నాయి. పిల్లల గుర్తింపు కార్డు మీద తల్లి పేరు కనపడనుంది. డాక్టర్‌ మందు చీటి మీద పేరు కనపడనుంది.
బెల్జియం రాకుమారి సైనిక శిక్షణ
కొత్త స్టూడెంట్‌ వస్తే క్లాస్‌ రూమ్‌కి కళ వస్తుంది. ఇక్కడ కొత్తగా వచ్చింది రాకుమారి ఎలిజబెత్‌! ఆమె అడుగు పెట్టగానే రాయల్‌ మిలటరీ అకాడెమీ మొత్తానికే కళాకాంతులు వచ్చాయి. కాంతి ఎక్స్‌ట్రా. ఆరేళ్లు రాగానే పిల్లల్ని మన భాషలో స్కూల్లో పడేసినట్లు.. పద్దెనిమిదేళ్లు రాగానే రాజవంశాల్లో మిలటరీ అకాడెమీకి పంపించేస్తారు. రెండుమూడేళ్ల వరకు ఇంటి మీద బెంగ పడేందుకు లేదు. ఎలిజబెత్‌ బెల్జియం రాకుమారి. క్రౌన్‌ ప్రిన్సెస్‌.
ఇరాన్‌పై ఆంక్షల్ని పునరుద్ధరించిన అమెరికా.
ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టుగా అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. వచ్చేవారంలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సమావేశంలో చట్ట విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయంపై గళమెత్తడానికి సిద్ధమవుతున్నాయి. 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ)లో నిబంధనల్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపించింది. భద్రతా మండలి చట్టాల ప్రకారం ఇరాన్‌ చేస్తున్న పనులు సరైనవి కావంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇరాన్‌కు నోటీసులు పంపారు.
  
సినిమా వార్తలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1630746                 About us   ||   Contact Us : admin@rajadhanivartalu.com